
వద్దని సాగునంపేలా..
●
●
● వ్యవసాయం వదులుకునేలా
కూటమి ప్రభుత్వ విధానాలు●
●
● భారీగా పెరిగిన కాంప్లెక్స్
ఎరువుల ధరలు
● జిల్లాలో రైతులపై
రూ.20.08 కోట్ల అదనపు భారం
ఆలమూరు: రైతే రాజన్నారు.. దేశానికే వెన్నెముక అన్నారు.. కానీ ఏమున్నది లాభం. ప్రస్తుతం రైతు పరిస్థితి అత్యంత దారుణం.. ప్రకృతి ప్రకోపానికి విలవిలలాడుతూ.. కరవు కోరల్లో చిక్కుకుంటూ.. ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురవుతూ.. కల్తీ పురుగు మందులు, నకిలీ విత్తనాల బారిన పడుతూ.. పంట నష్టాలను చవిచూస్తున్న పుడమి పుత్రులకు ఆకలే మిగులుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చాక సాగు దండగ అన్నట్టు మార్చేసింది. పంటల సాగు వైపు రైతన్నలు చూడకుండా చేస్తోంది.. అన్నదాత సుఖీభవ పథకాన్ని తొలి ఏడాది అమలు చేయకుండా కష్టపెట్టింది. పంటల బీమా భారం సైతం రైతులపై వేసింది. ఇదిలా ఉంటే వరి సాగులో ఏటా పెట్టుబడి పెరిగిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అస్తవ్యస్త విధానాలతో ఎరువుల ధరలు కూడా భారీగా పెరగడం ఇబ్బందికరంగా పరిణమించింది. రాష్ట్రంలో ఎరువుల ధరలు పెరుగుతున్నంత వేగంగా ధాన్యానికి మద్దతు ధర పెరగకపోవడంతో వ్యవసాయం చేయడానికి చాలామంది వెనకడుగు వేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఖరీఫ్ సీజన్‌లో ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో ఒక్కొక్క కాంప్లెక్స్ ఎరువుల బస్తాపై రూ.50 నుంచి రూ.300 వరకూ పెరిగింది. జిల్లాలో 1.64 లక్షల ఎకరాల్లో వరి సాగు జరగనుండగా, పెరిగిన ఎరువుల రూపంలో 1.35 లక్షల మంది రైతులపై రూ.20.08 కోట్ల మేర అదనపు భారం పడనుంది.
సరిపడా రాక.. సమస్య తీరక
నత్రజని (ఎన్), భాస్వరం (పి), పొటాషియం (కె) మిశ్రమంతో కూడిన కాంప్లెక్స్ ఎరువులు పంటల పెరుగుదలకు అవసరమైన పోషకాలను సమతుల్యంగా అందిస్తాయి. అలాంటి కాంప్లెక్స్ ఎరువులను కొనుగోలు చేయడం ఏటా రైతులకు భారం అవుతోంది. ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి జిల్లాలోని వరి సాగుకు 43,493 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం కాగా, ప్రస్తుతం 24,405 మెట్రిక్ టన్నులు మాత్రమే అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ శాఖ చెబుతుంది. ప్రస్తుతం జిల్లాలోని 166 సొసైటీలతో పాటు కొన్ని ఎరువు, పురుగు మందుల దుకాణాల ద్వారా ఎరువుల విక్రయం జరుగుతోంది. వ్యాపారులు, అధికారులు, డీలర్లు కొన్నిచోట్ల కుమ్మకై ్క ఎరువుల కృత్రిమ కొరతను సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఖరీఫ్ సీజన్‌లో సాధారణంగా ఎకరాకు మూడు బస్తాల కాంప్లెక్స్ ఎరువులు, 90 కిలోల (రెండు బస్తాలు) యూరియా, 25 కిలోల వరకూ జింక్, పొటాష్ వినియోగిస్తుంటారు. జిల్లాలో వెదజల్లు విధానంతో పాటు వరి నాట్లు వేస్తున్నాయి. ఇందులో ఈ ఏడాది 80 శాతం మేర స్వర్ణ (ఎంటీయూ 7029) రకం సాగు చేస్తుండగా, మిగిలిన చోట ఎంటీయూ 1318తో పాటు కొన్ని ఇతర రకాలను పండించడానికి రెడీ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం భారీగా రాయితీని అందించే యూరియా నిల్వలు జిల్లాకు సరిపడా సరఫరా కాలేదని తెలుస్తోంది. దీనివల్ల భవిష్యత్‌లో ఎరువుల కొరతను ఎదుర్కోవాల్సి వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.
స్పందించని వ్యవసాయ శాఖ
ఎరువుల నిల్వలు, పంపిణీ విధానంపై జిల్లా వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించగా ఏవిధమైన స్పందన లేకుండా పోయింది. కనీసం నిల్వల వివరాలు కూడా చెప్పకపోవడం విమర్శలకు తావిస్తుంది. వ్యవసాయ శాఖ నిర్లక్ష్యం వల్ల కాంప్లెక్స్ ఎరువులను రోజుకోఽ ధరకు విక్రయిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రైతుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఎరువులను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే కొన్ని కాంప్లెక్స్ ఎరువుల ముడిసరకుల ధరలు పెరుగుతున్నందు వల్ల కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచుతుందని చెబుతున్నారు.
పినపళ్లలో వరి పొలంలో ఎరువులు చల్లుతున్న రైతు
పినపళ్లలో వరి పొలంలో ఎరువులు జల్లుతున్న రైతు
వరి పొలంలో ఎరువులను
చల్లేందుకు మిశ్రమం సిద్ధం చేస్తున్న రైతు
ఎరువుల పెరుగుదల ఇలా..
50 కిలోల బస్తా (రూపాయల్లో)
రకం 2019 2021 2024 2025
10–26–26 1,175 1,375 1,550 1,850
20–20–0–13 950 1,175 1,200 1,400
14–35–14 1,250 1,450 1,700 1,900
19–19–19 950 1,175 1,350 1,850
పొటాష్ 1,225 1,350 1,535 1,800
డీఏపీ 1,350 1,350 1,350 1,400
28–28–0 1,275 1,400 1,550 1,850

వద్దని సాగునంపేలా..

వద్దని సాగునంపేలా..