
హెచ్‌ఎంల సంఘ జిల్లా కార్యవర్గం ఎన్నిక
అమలాపురం టౌన్: ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా కార్యవర్గం ఎన్నిక అమలాపురం జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల వద్ద ఆదివారం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రధానోపాధ్యాయుల సంఘానికి అనుబంధంగా జిల్లా సంఘం ఏర్పాటైంది. జిల్లా సంఘ గౌరవాధ్యక్షుడిగా జేఎన్‌ఎస్ గోపాలకృష్ణ, అధ్యక్షుడిగా మోకా ప్రకాష్, ప్రధాన కార్యదర్శిగా నిమ్మకాయల గణేశ్వరరావు, కోశాధికారిగా రాయుడు ఉదయ భాస్కరరావు ఎన్నికయ్యారు. వీరితోపాటు రాష్ట్ర కౌన్సిలర్లుగా బీవీవీ సుబ్రహ్మణ్యం, పి.శ్రీనివాసు, యు.మాచిరాజు, ఇతర జిల్లా కౌన్సిలర్లుగా, ఆర్గనైజింగ్ సెక్రటరీగా పి.పల్లయ్యశాస్త్రి, హెడ్ క్వార్టర్ సెక్రటరీగా పీఎన్‌వీ ప్రసాదరావు, మహిళా ప్రతినిధిగా చిట్టినీడి నిరంజని, మున్సిపల్ పాఠశాలల ప్రతినిధిగా కె.ఘన సత్యనారాయణ, జిల్లా కార్యవర్గ సభ్యులుగా జి.నాగ సత్యనారాయణ, ఎం.వెంకటరాజు, పి.శ్రీరామచంద్రమూర్తి, బి.చిరంజీవిరావు, టీవీ రాఘవరెడ్డి, ఎం.రాజు ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలకు పరిశీలకులుగా రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శి వి.శ్రీనివాసరావు, రాష్ట్ర సంఘం కోశాధికారి సీవీవీ సత్యనారాయణ వ్యవహరించారు. అనంతరం నూతన కార్యవర్గ ప్రతినిధులచే ప్రమాణ స్వీకారం చేయించారు.
రత్నగిరి కిటకిట
అన్నవరం: వేలాదిగా తరలి వచ్చిన భక్తులతో రత్నగిరి ఆదివారం కిటకిటలాడింది. రత్నగిరి పైన, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోను శనివారం రాత్రి, ఆదివారం వేకువజాము ముహూర్తాల్లో పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. దీంతో, అధిక సంఖ్యలో నవదంపతులు సత్యదేవుని వ్రతాలాచరించి, స్వామివారిని దర్శించారు. వారికి వారి బంధుమిత్రులు, ఇతర భక్తులు కూడా తోడవడంతో ఆలయ ప్రాంగణం రద్దీగా మారిపోయింది.