
దాత సాయంతో స్కూల్‌కు డైనింగ్ హాల్
మామిడికుదురు: స్థానిక జెడ్పీహెచ్ స్కూల్ ప్రాంగణంలో పాశర్లపూడి గ్రామానికి చెందిన భూపతి నాగేశ్వరరావు జ్ఞాపకార్థం అతని కుటుంబ సభ్యులు రూ.35 లక్షలతో అధునాతన డైనింగ్ హాల్ నిర్మించారు. స్కూల్ పూర్వ విద్యార్థి అయిన నాగేశ్వరరావు ఈ ప్రాంతం ప్రజలకు ఉచితంగా వైద్యం అందించి పేదల డాక్టర్‌గా గుర్తింపు పొందారు. అతని పేరిట స్కూల్ ప్రాంగణంలో శాశ్వత కట్టడం నిర్మించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించి డైనింగ్ హాల్‌ను నిర్మించారు. డైనింగ్ హాల్ నిర్మాణంతో పాటు 40 స్టీలు బెంచీలు, 20 టేబుల్స్ కొని ఇచ్చారు. ప్రస్తుతం ఈ స్కూల్ల్ 460 మంది వరకు విద్యార్థులు ఉన్నారు. స్కూల్‌లో అమలు చేస్తున్న మధ్యాహ్నం భోజనం తీనేందుకు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. వారి అవసరాలను దృష్టిలో ఉంచుకుని డైనింగ్ హాల్ నిర్మించారు. శనివారం ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశామని హెచ్‌ఎం బి.చిరంజీవిరావు తెలిపారు.