Youth Committed Suicide Due To Cricket Betting In Rangareddy, Details Inside - Sakshi
Sakshi News home page

రంగారెడ్డి: ప్రాణం తీసిన ఐపీఎల్ క్రికెట్‌ బెట్టింగ్ 

May 18 2023 12:48 PM | Updated on May 18 2023 1:07 PM

Youth Committed Suicide Due To Cricket Betting In Rangareddy - Sakshi

రాత్రి జరిగిన ఢిల్లీ వర్సెస్ పంజాబ్ క్రికెట్ మ్యాచ్‌లో పంజాబ్ గెలుస్తుందని ప్రకాష్ కొంతమంది మిత్రులతో బెట్టింగ్ వేశాడు.

సాక్షి, రంగారెడ్డి: జిల్లా వ్యాప్తంగా బెట్టింగ్‌ జోరుగా సాగుతున్నాయి. ఇందులో డబ్బులు పందాలు కాచి పలువురు ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా షాద్‌ నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలంలోని గిరాయి గుట్ట తండా పరిధిలోని నార్లగూడ తండాలో అంగోతు ప్రకాష్ (19) అనే యువకుడు బెట్టింగ్‌లో డబ్బులు కోల్పోయి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

రాత్రి జరిగిన ఢిల్లీ వర్సెస్ పంజాబ్ క్రికెట్ మ్యాచ్‌లో పంజాబ్ గెలుస్తుందని ప్రకాష్ కొంతమంది మిత్రులతో బెట్టింగ్ వేశాడు. ఈ మ్యాచ్‌లో పంజాబ్ ఓడిపోయింది. దీంతో బెట్టింగ్ మాఫియా డబ్బులు ఇవ్వాలని బలవంతం చేశారు. బెట్టింగ్ డబ్బులు కట్టలేని పరిస్థితిలో ఉన్న ప్రకాష్ ఏం చేయాలో తెలియక మానసిక ఒత్తిడికి గురై ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని గ్రామస్థులు తెలిపారు.
చదవండి: ఆ పేద బతుకులపై విధి కన్నెర్రచేసిందో ఏమో..

Advertisement
 
Advertisement
Advertisement