హ్యాండిచ్చిన ప్రియుడు.. కోపంతో రగిలిపోయిన ఆ యువతి కత్తితో.. | Sakshi
Sakshi News home page

Hyderabad: హ్యాండిచ్చిన ప్రియుడు.. కోపంతో రగిలిపోయిన ఆ యువతి కత్తితో..

Published Sun, Jan 16 2022 8:49 PM

Young woman stabs Lover In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రేమించి మోసం చేశాడని యువకుడిని ఓ యువతి కత్తితో పొడిచిన ఘటన లంగర్‌హౌస్‌లో కలకలం రేపింది. ఘటనపై వివరాలు సేకరించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొన్ని నెలలుగా ప్రేమించుకుంటున్న వారిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో ప్రియుడు దూరం పెట్టాడు. తనను మోసం చేస్తున్నాడనే కోపంతో ఆ యువతి కత్తితో దాడి చేసింది. స్థానికులు అప్రమత్తమై ఆ యువకుడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. యువతిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
చదవండి: ఫ్యాన్‌కు వేలాడుతూ.. బ్యూటీషియన్‌ మృతదేహం! వారం తర్వాత..

Advertisement
 
Advertisement
 
Advertisement