మంట కలిసిన మానవత్వం

Woman Takes Own Life In Front Of Lover House - Sakshi

సాక్షి, చెన్నై : తనను మోసం చేసిన ప్రియుడి ఇంటి ముందు ఓ మహిళ ఆత్మాహుతి చేసుకుంది. ఆమె మంటల్లో కాలుతున్నా ఎవరూ ఆర్పే ప్రయత్నం చేయలేదు. కొందరు వీడియో తీయటంలో నిమగ్నమయ్యారు. దిండుగల్‌ జిల్లా కొడైకెనాల్‌ కేసిపట్టి గ్రామంలో సోమవారం మధ్యాహ్నం ఓ టీ దుకాణం సమీపంలో మూడేళ్ల బిడ్డను ఓ మహిళ వదిలి పెట్టింది. కూత వేటు దూరంలోని ఓ ఇంటికి సమీపంలో తన ఒంటి మీద పెట్రోల్‌ పోసుకుని నిప్పు అంటించుకుంది. ఆమె పెట్రోల్‌ పోసుకుంటున్నా, నిప్పు వెలిగించినా, మంటల్లో కాలుతున్నా ఎవ్వరూ పట్టించుకోలేదు. ఆ టీ దుకాణంలో ఉన్న వాళ్లు తమ కెమెరాల్లో ఆ దృశ్యాల్ని చిత్రీకరించారు. ( బోర్డు మీటింగ్‌లోనే తమ్ముడిపై దాడి )

మరి కొందరు తమకేమీ పట్టనట్టుగా రోడ్డు మీద నడచుకుంటూ వెళ్లారు. చివరకు ఓ వ్యక్తి స్పందించి తన పంచెతో మంటల్ని ఆర్పే యత్నం చేసినా అప్పటికే ఆమె కాలిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని విచారించారు. ఆమె పేరు మాలతీగా గుర్తించారు. భర్తను వీడి జీవిస్తున్న ఆమెను ఆ ఇంట్లో ఉన్న డ్రైవర్‌ సతీష్‌ రహస్యంగా వివాహం చేసుకున్నట్టు విచారణలో తేలింది. వీరికి మూడేళ్ల బిడ్డ ఉన్నాడు. గత వారం సతీష్‌ మరో వివాహం చేసుకున్నాడు. మాలతీకి అన్యాయం జరగడంతో ప్రియుడి ఇంటి ముందు ఆత్మాహుతి చేసుకుంది.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top