ఇక్రమ్‌... ఇంకొన్నాళ్లు ఇక్కడే!

Usman Ikram Case Trial Pause For COVID 19 in Hyderabad - Sakshi

ఇతడు సైబర్‌ క్రైమ్‌లో చిక్కిన పాకిస్థానీ 

చార్జ్‌షీట్‌ వేసిన నగర సైబర్‌ క్రైమ్‌ కాప్స్‌ 

విచారణ ముగియగానే పాక్‌కు పంపేయాల్సిందే 

కరోనా ఎఫెక్టుతో నిలిచిన కేసు ట్రయల్‌ 

సాక్షి, సిటీబ్యూరో: దేశంలోకి అక్రమంగా ప్రవేశించి, సైబర్‌ క్రైమ్‌కు పాల్పడి సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు చిక్కిన పాకిస్థానీ  మహ్మద్‌ ఉస్మాన్‌ ఇక్రమ్‌ ఇంకొన్నాళ్లు ఇక్కడే ఉండాల్సిన పరిస్థితి. కేసులో అభియోగపత్రం దాఖలై, విచారణ ప్రారంభమైనా... కోవిడ్‌ ప్రభావంతో దానికి బ్రేక్‌ పడింది. దీంతో మళ్లీ ట్రయల్‌ మొదలై, ముగిసే వరకు డిపోర్టేషన్‌ ప్రక్రియ ఆగాల్సి వచ్చింది.  

‘ఆమె’ కోసం వచ్చి బుక్కయ్యాడు... 
నగరంలోని పాతబస్తీకి చెందిన ఓ మహిళ కొన్నేళ్ల క్రితం భర్తను కోల్పోయారు. సదరు మహిళకు ఇద్ద రు కుమార్తెలు.  పన్నెండేళ్ల క్రితం బతుకుతెరువు కోసం దుబాయ్‌ వెళ్లిన ఆమెకు అక్కడ పాకిస్థానీ మహ్మద్‌ ఉస్మాన్‌ ఇక్రమ్‌ అలియాస్‌ అబ్బాస్‌ ఇక్రమ్‌తో పరిచయమైంది. తాను భారతీయుడినే అని, స్వస్థలం ఢిల్లీ అని నమ్మించిన అతగాడు ఆమెను వివాహం చేసుకున్నాడు. కొన్నాళ్లకు అసలు విషయం తెలిసిన సదరు మహిళ హైదరాబాద్‌ తిరిగి వచ్చేశారు. 2011లో ఉస్మాన్‌ సైతం అక్రమం మార్గంలో హైదరాబాద్‌కు వచ్చాడు.  

సైబర్‌ క్రైమ్‌కు పాల్పడి అరెస్టు..
ఇక్రమ్‌ వచ్చిన ఆరు నెలలకు ఇతగాడు అక్రమంగా దేశంలోకి వచ్చాడని తెలుసుకున్న సదరు మహిళ అతడిని దూరంగా ఉంచడం ప్రారంభించారు. దీంతో కక్షగట్టిన ఇక్రమ్‌ ఆమె 12 ఏళ్ల కుమార్తె నగ్న చిత్రాలు చిత్రీకరించడంతో పాటు కొందరికి ఆన్‌లైన్‌లో విక్రయించానంటూ బెదిరింపులకు దిగాడు. తనకు డబ్బు ఇవ్వకపోతే సదరు ఫొటోలను బయటపెడతానని బాధిత మహిళ స్నేహితురాలికీ వాట్సాప్‌ సందేశం పంపాడు. అతడి వేధింపులు తట్టుకోలేకపోయిన బాధితురాలు సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన అధికారులు 2018 జూన్‌లో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అబ్బాస్‌ పేరుతో అనేక బోగస్‌ ధ్రువీకరణలు పొంది పాస్‌పోర్ట్‌ తీసుకున్నాడని, అలాగే కొన్ని ప్రైవేట్‌ ఉద్యోగాలు కూడా చేశాడని బయటపడింది.  

ధ్రువీకరించిన పాక్‌ ఎంబసీ ఆఫీస్‌..
ఇతగాడిని అరెస్టు చేసినప్పుడు మహారాష్ట్రలోని ఓ ప్రైవేట్‌ విద్యా సంస్థలో టెన్త్‌ నుంచి డిగ్రీ (2003–08)  వరకు   చదివినట్లు ఉన్న సర్టిఫికెట్లతో పాటు అబ్బాస్‌ పేరుతో గోల్నాక చిరునామాతో 2012లో తీసుకున్న భారత పాస్‌పోర్ట్, ఆధార్‌ సహా ఇతర గుర్తింపు కార్డులతో పాటు పాక్‌ పాస్‌పోర్ట్‌నకు చెందినదిగా అనుమానిస్తున్న ఓ పేజీ జిరాక్సు ప్రతిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  ఇతడివద్ద ఉన్నవి బోగస్‌ పత్రాలని, వాస్తవానికి పాక్‌ జాతీయుడని నిర్థారించడం కోసం సైబర్‌ క్రైమ్‌ పోలీసులు విదేశీ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) ద్వారా ఎంఈఏ పాక్‌కు లేఖ రాశారు. ఆ దేశ రాయ బార కార్యాలయం అతడు తమ జాతీయుడేనంటూ సమాధానం ఇచ్చింది.  

కోవిడ్‌తో ఆగిన ట్రయల్‌... 
దీన్ని ఆధారంగా చేసుకున్న సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఇక్రమ్‌పై అభియోగపత్రాలు దాఖలు చేశారు. సాధారణంగా నేరం చేసిన వాళ్లను జైలుకు పంపి, నిరూపితం కాని వారిని బయటకు వదిలేస్తారు. అయితే ఇక్రమ్‌ కేసులో మాత్రం ఈ విధానం చిత్రంగా ఉంది. అతడు దోషిగా తేలినా, నిర్దోషిగా బయటపడినా తక్షణం ఆ దేశానికి పంపేయాల్సిందే. ఎంఈఏ నుంచి ఈ మేరకు అందిన ఉత్తర్వుల మేరకు కోర్టులో కేసు డిస్పోజ్‌ అయిన వెంటనే అతడిని తీసుకువెళ్లి ఢిల్లీలోని పాక్‌ ఎంబసీలో అప్పగించాలని యోచించారు. అయితే ఈ ఏడాది మార్చి నుంచి కోవిడ్‌ ప్రభావం, లాక్‌డౌన్‌ తదితరాల నేపథ్యంలో కేసు ట్రయల్‌ ఆగిపోయింది. ఫలింతంగా ఇక్కమ్‌ రిమాండ్‌ ఖైదీగా జైల్లోనే ఉండిపోయాడు. కోర్టులు  పూర్తి స్థాయిలో పని చేయడం ప్రారంభమై, కేసు విచారణ ముగిసే వరకు ఇక్రమ్‌ ఇక్కడ ఉండాల్సిందే. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

28-11-2020
Nov 28, 2020, 11:13 IST
మహారాష్ట్ర: కరోనా బారిన పడి నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే భారత్‌ భాల్కే మరణించారు. పుణేలోని రబీ ఆస్పత్రిలో శుక్రవారం నుంచి...
28-11-2020
Nov 28, 2020, 08:23 IST
బీజింగ్‌: ప్రాణాంతక కరోనా వైరస్‌ గురించి మరో కొత్త విషయం బయటపడింది. శరీరం మొత్తం వ్యాపించేందుకు కరోనా వైరస్‌ మన...
28-11-2020
Nov 28, 2020, 04:53 IST
సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) కరోనా వ్యాధి నిర్ధారణకు అభివృద్ధి...
28-11-2020
Nov 28, 2020, 04:26 IST
న్యూఢిల్లీ: కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆంక్షల్ని కఠినంగా అమలు చేయాలని సుప్రీం కోర్టు శుక్రవారం కేంద్రానికి ఆదేశాలు...
28-11-2020
Nov 28, 2020, 03:27 IST
సాక్షి, అమరావతి: కోవిడ్‌–19 నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను నీతి ఆయోగ్‌ ప్రశంసించింది. ముందు చూపుతో వ్యవహరించి వైరస్‌...
27-11-2020
Nov 27, 2020, 17:34 IST
న్యూఢిల్లీ: భారత్‌, బంగ్లాదేశ్‌ల మధ్య వ్యాక్సిన్‌ డీల్‌ కుదిరింది. పొరుగు దేశానికి మూడు కోట్ల వ్యాక్సిన్‌ డోసులు సరఫరా చేసేందుకు...
27-11-2020
Nov 27, 2020, 13:50 IST
మాస్కో/ హైదరాబాద్‌: దేశీయంగా రష్యన్‌ వ్యాక్సిన్‌ తయారీకి హైదరాబాద్‌ ఫార్మా కంపెనీ హెటెరో డ్రగ్స్‌ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. రష్యన్‌ డైరెక్ట్‌...
27-11-2020
Nov 27, 2020, 11:47 IST
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. భారత్‌లో నమోదైన మొత్తం కరోనా కేసులు 93లక్షలు దాటేసింది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 43,082 కోవిడ్‌...
27-11-2020
Nov 27, 2020, 10:44 IST
న్యూఢిల్లీ, సాక్షి: కరోనా వైరస్‌ కట్టడికి వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చినప్పటికీ తాను తీసుకోబోనని బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో తాజాగా స్పష్టం...
27-11-2020
Nov 27, 2020, 09:26 IST
ముంబై, సాక్షి: అన్నీ అనుకున్నట్లు జరిగితే.. వచ్చే మార్చికల్లా కోవిడ్‌-19 కట్టడికి వ్యాక్సిన్‌ను విడుదల చేసే వీలున్నట్లు దేశీ ఫార్మా...
27-11-2020
Nov 27, 2020, 08:22 IST
అహ్మదాబాద్‌: గుజరాత్‌లో విషాదం చోటుచేసుకుంది. రాజ్‌కోట్‌లోని కోవిడ్‌ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదురుగు కరోనా పేషెంట్లు...
27-11-2020
Nov 27, 2020, 08:05 IST
సాక్షి, హైదరాబాద్‌ : రోజూ 50 వేల కరోనా పరీక్షలు, వారానికోసారి లక్ష పరీక్షలు చేయాలన్న తమ ఆదేశాలను అమలు...
26-11-2020
Nov 26, 2020, 19:24 IST
‘‘ఇది సాధారణ సంవత్సరమయ్యుంటే ఇది ఒక మంచి కథలా మిగిలిపోయేది. ప్రస్తుతమున్న పరిస్థితులను బట్టి చూస్తే ఇది ఒక గొప్ప...
26-11-2020
Nov 26, 2020, 16:35 IST
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్న సమయంలో ఫేస్‌మాస్క్‌ ధరించడం అనివార్యంగా మారిపోయింది.
26-11-2020
Nov 26, 2020, 13:30 IST
న్యూయార్క్‌: కరోనా వైరస్‌ కట్టికి బ్రిటిష్‌, స్వీడిష్‌ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనకా రూపొందిస్తున్న వ్యాక్సిన్‌ తయారీలో పొరపాటు దొర్లినట్లు తాజాగా ఆక్స్‌ఫర్డ్‌...
26-11-2020
Nov 26, 2020, 13:11 IST
సాక్షి, న్యూఢిల్లీ: ఈ–కామర్స్‌ అమ్మకాలకు కరోనా వైరస్‌ కలిసొచ్చింది. గతేడాది పండుగ సీజన్‌తో పోలిస్తే ఈ ఏడాది ఫెస్టివల్‌ సీజన్‌లో...
26-11-2020
Nov 26, 2020, 12:07 IST
సింగపూర్: కోవిడ్ -19 వ్యాప్తిని అరికట్టడానికి ఉపయోగించే మాస్క్‌ తయారీలో వాడే పదార్థాలు, దాని రూపకల్పన, పొడవు తదితర అంశాలు...
26-11-2020
Nov 26, 2020, 10:02 IST
సాక్షి, ముంబై : రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో లాక్‌డౌన్‌ విధించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తుండటంతో...
26-11-2020
Nov 26, 2020, 09:54 IST
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 44,489 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి....
26-11-2020
Nov 26, 2020, 08:25 IST
భోపాల్‌: కరోనా రోగులకు చికిత్స అందించే క్రమంలో మహమ్మారి బారిన పడిన ఓ యువ వైద్యుడు కన్నుమూశాడు. నెలరోజుల పాటు...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top