భర్త దుబాయ్‌లో ఉండగా.. తలుపులు బద్దలు కొట్టి వివాహిత చేయి పట్టుకుని..

Two youngsters attempt To Molest Married woman In Adilabad - Sakshi

సాక్షి, భైంసా(ఆదిలాబాద్‌): లోకేశ్వరం మండలం నగర్‌ గ్రామానికి చెందిన వివాహిత పై గతనెల 24వ తేదీన లైంగిక దాడికి యత్నించినట్లు బాధిత మహిళ స్థానిక పోలీస్‌స్టేన్‌లో ఫిర్యాదు చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి.. నగర్‌ గ్రామానికి చెందిన వివాహితకు 11 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. బతుకుదెరువు కోసం భర్త దుబాయ్‌ వెళ్లగా ఇద్దరు చిన్నపిల్లలతో ఇంట్లోనే ఉంటోంది. గత 24న రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో అదే గ్రామానికి చెందిన ఫారుక్, అజామ్‌లు తలుపులు కొట్టాడు. వివాహిత కిటికిలో నుంచి చూసి తలుపులు తీయలేదు. ఫారుక్‌ తలుపులు తొలగించి లోనికి వచ్చి చేయి పట్టుకుని కొట్టి లైంగికదాడికి యత్నించాడు.

ఆమె కేకలు వేయగా పక్కనే ఉన్న మామ ఎవరని అరవగా అతడు పారిపోయాడు. ఎవరికైన చెబితే ఇద్దరు పిల్లలను చంపుతానని బెదిరించడంతో ఈ విషయం చెప్పలేదు. రెండు రోజుల క్రితం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడంతో సోమవారం మధ్యాహ్నం బాధితురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా సంఘటన వెలుగులోకి వచ్చింది. ఎస్సై సాయికుమార్‌ని వివరణ కోరగా ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు వెల్లడించారు.

చదవండి: యువకుడి ప్రేమలో పడి.. శారీరకంగా కలిసి.. చివరికి పోలీస్‌స్టేషన్‌లో..

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top