కోవిడ్‌ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం.. 10 మంది మృతి

Ten Deceased In Covid 19 Hospital Blaze In Romania - Sakshi

మరో ఏడుగురికి తీవ్ర గాయాలు

బుకారెస్ట్ : కోవిడ్‌ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగి 10 మంది మృతి చెందిన ఘటన రొమేనియా దేశంలో చోటు చేసుకుంది. పియాట్రా నీమ్ట్‌ నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కోవిడ్‌ రోగుల కోసం ఏర్పాటు చేసిన ఇంటెన్సివ్‌ కేర్‌ వార్డ్‌లో షార్ట్‌సర్క్యూట్‌ జరగడంతో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన సిబ్బంది రోగులలందరిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో 10 మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు. శనివారం జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకరు మినహా మరణించిన వారంతా ఆస్పత్రి రోగులేనని అధికారులు స్పష్టం చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top