Nellore: పేలిన తూటాలు.. రాలిన ప్రాణాలు.. ఉలిక్కిపడిన తాటిపర్తి

Techie Shot Woman Over Love Failure In Nellore District - Sakshi

జిల్లాలోని పొదలకూరు మండలం తాటిపర్తి.. ఒకప్పుడు వర్గ రాజకీయ హత్యలతో అట్టుడికిన గ్రామం. ఆ ఊరంతా వ్యవసాయ ఆధారితంగా జీవనం సాగిస్తోంది. నేటితరం యువత ఉన్నత చదువులు చదువుకుని వివిధ రంగాల్లో స్థిరపడుతున్నారు. కాలంతో పాటు ఆ ఊరు రాజకీయ వైషమ్యాలకు దూరమైంది. ఒకరికొకరు కలుపుగోలుగా ఉండడంతో ప్రశాంతంగా ఉంటున్న ఆ పల్లె ఒక్కసారిగా ఉలిక్కి పడింది. గ్రామానికి చెందిన ఓ యువకుడు తాను ఇష్టపడిన యువతి పెళ్లికి నిరాకరించిందని తుపాకీతో కాల్చి, తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
చదవండి: వివాహేతర సంబంధం.. భర్తను అడ్డు తొలగిస్తే కలసి జీవించవచ్చని..

పొదలకూరు(నెల్లూరు జిల్లా): వ్యవసాయం, పాడి–పంటలతో అలరారుతున్న ఆ పల్లెలో ప్రేమోన్మాద తూటాలు పేలాయి. ఆ ఊరు ఉలిక్కిపడింది. విషయం తెలిసి విషాదంలో మునిగిపోయింది. తాను మనసు పడిన యువతి పెళ్లికి నిరాకరించిందన్న కోపంతో యువకుడు తుపాకీతో ఆమెను కాల్చి, తాను కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నా డు. మండలంలోని తాటిపర్తిలో దిగువ మధ్య తరగతికి చెందిన ఒకే సామాజిక వర్గానికి చెందిన ఆ రెండు కుటుంబాలు ఉన్నంతలో ఉన్నతంగా జీవనం సాగి స్తున్నారు. గౌరవంగా జీవిస్తున్న ఆ కుటుంబాలు విధి ఆడిన వింత నాటకంలో విషాదంలో మునిగిపోయా యి. హతురాలు కావ్య, ఆత్మహత్య చేసుకున్న సురేష్‌రెడ్డి కుటుంబాల నేప«థ్యాలు ఇంచుమించుగా ఒకటే. ఉన్నతంగా ఎదగాలని ఉన్నత చదువులు చదు వుకుని సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు సంపాదించుకున్నారు.

సాఫ్ట్‌వేర్‌గా సంతోషాన్ని ఆస్వాదిస్తుండగానే..  
హతురాలు పలుకూరు కావ్య తండ్రి వెంకటనారపరెడ్డి మూడెకరాల రైతు. ఆయనకు ఇద్దరమ్మాయిలు. ఉన్నంతలో ఇద్దరు ఆడబిడ్డలను బాగా చదివించాడు. కావ్య పెద్దామ్మాయి. ఇంజనీరింగ్‌ పూర్తి చేసి ఏడాదిన్నర కిందట సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం సంపాదించింది. వర్క్‌ ఫ్రం హోమ్‌ చేసుకుంటూ తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటుంది. చిన్నమ్మాయి కూడా  సాఫ్ట్‌వేర్‌ రంగాన్ని ఎంచుకుని చదువుతోంది. కావ్య సాఫ్ట్‌వేర్‌గా సంతోషాన్ని ఆస్వాదిస్తుంది. ఇంతలోనే  ప్రేమోన్మాదానికి బలైపోయింది.

పెళ్లి ఆశ నెరవేరలేదు..  
మాలపాటి సురేష్‌రెడ్డి తండ్రి సుబ్బారెడ్డి సైతం సన్నకారు రైతు. వ్యవసాయంతో పాటు వరిగడ్డి వ్యాపా రం చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. ఆయనకు కొడుకు, కుమార్తె. ఆడపిల్లకు పెళ్లి చేశాడు. సురేష్‌రెడ్డి పెద్దవాడు కావడంతో బాగా చదివించాడు. ఐదేళ్ల కిందటే సురేష్‌రెడ్డి బెంగళూరులో సాప్‌్టవేర్‌  ఉద్యోగం సంపాదించాడు. ఇప్పుడు నెలకు రూ.లక్షకు పైగా జీతం పొందుతున్నాడు. తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఆశ పడ్డాడు.  ఆ అమ్మాయి పెళ్లికి నిరాకరించడంతో ఆమెను చంపి.. తాను ఆత్మహత్య చేసుకున్నాడు.

గ్రామంలో విషాదఛాయలు 
కాల్పుల ఘటనతో గ్రామం ఉలిక్కి పడింది. విష యం తెలియడంతో విషాదఛాయలు అలముకున్నా యి. ఇరు కుటుంబాలు శోకసముద్రంలో మునిగిపోయాయి. ఎంతో భవిష్యత్‌ ఉన్న యువతి, యువ కుల జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోవడంతో బంధువర్గాలు తల్లిడిల్లిపోతున్నాయి.

పోలీసుల సమగ్ర దర్యాప్తు 
కాల్పుల ఘటనపై పోలీసు అధికారులు సమగ్ర దర్యాప్తు చేపట్టారు. ఎస్పీ విజయారావు, అడిషనల్‌ ఎస్పీ చౌడేశ్వరీ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆత్మకూరు డీఎస్పీ వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో పొదలకూరు సీఐ సంగమేశ్వరరావు, ఎస్సై కరిముల్లా దర్యాప్తు చేపట్టారు. ఎస్పీ  మాట్లాడు తూ కావ్యతో సురేష్‌రెడ్డి చాటింగ్‌ చేశాడని, అయితే ఆమె మాత్రం తిరిగి చాటింగ్‌ చేయలేదని తెలిపారు. ఇద్దరి సెల్‌ఫోన్లను స్వాధినం చేసుకున్న పోలీసులు మిస్టరీని ఛేదించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే పిస్టల్‌ చుట్టూ క్రైమ్‌ స్టోరీ నడుస్తోంది. సురేష్‌రెడ్డి పిస్టల్‌ ఎక్కడ సంపాదించాడు? ఎవరి వద్ద పిస్టల్‌ కొనుగోలు చేశాడనే కోణంలో ప్రధానంగా పోలీసు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పిస్టల్‌పై ‘మేడిన్‌ యూఎస్‌ఏ’ ఉంది.

కావ్య అంటే ఇష్టంతో.. 
కావ్య, సురేష్‌రెడ్డిలది ఇద్దరిది ఒకే ఊరు. కావ్య అంటే ఇష్టం పెంచుకున్న సురేష్‌రెడ్డి ఏడాది కాలంగా తల్లిదండ్రుల ద్వారా ఆమెను తనకిచ్చి వివాహం జరిపించాల్సిందిగా కోరుతున్నాడు. ఇదే విషయాన్ని కావ్య కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకెళ్లాడు. అయితే కావ్య తల్లిదండ్రులు ఈ వివాహానికి సమ్మతించలేదు. బహుశా ఇద్దరి మధ్య 12 ఏళ్ల వయస్సు తేడా ఉండడంతో ఒప్పుకోలేదని గ్రామస్తుల అభిప్రాయం. కానీ సురే‹Ù రెడ్డి పట్టు వదలకుండా కావ్యతోనే తన పెళ్లి జరగాలని తిరుగుతున్నాడు. ఈ నేపథ్యంలో ఒంటిరి తనాన్ని అలవాటు చేసుకుని డిప్రెషన్లోకి వెళ్లినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ దారుణానికి తెగబడినట్లు సర్వత్రా వినిపిస్తోంది.

ఈ ఘోరం ఊహించలేదు 
ఇంత ఘోరం జరుగుతుందని ఊహించలేదు. మా గ్రామంలో ఇలాంటి ఘటనలు ఇప్పటి వరకు జరగలేదు. అన్యాయంగా నా మనమరాలిని హత్య చేశాడు. ఏ పాపం తెలియని అమ్మాయి బలికావాల్సి వచ్చింది.
– పలుకూరు మస్తాన్‌రెడ్డి, కావ్య తాత 

పిస్టల్‌ ఎలా వచ్చిందో తెలియదు 
మా అబ్బాయి సురేష్‌రెడ్డికి పిస్టల్‌ ఎలా వచ్చిందో తెలియదు. మా దురదృష్టం కొద్ది ఈ ఘటన జరిగింది. ఇంట్లో మా వాడు బాగానే ఉండేవాడు. ఎందుకు ఈ చర్యకు పాల్పడ్డాడో తెలియడం లేదు. మాకు పుత్రశోకం మిగిల్చి వెళ్లాడు.
– మాలపాటి పరమేశ్వరి, సురేష్‌రెడ్డి తల్లి   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top