ఇంటి దొంగే.. రూ.10 కోట్లు డిమాండ్‌

Son Blackmailed His Father To Give Him Ten Crores - Sakshi

ఘజియబాద్‌కు చెందిన ఒక 11 సంవత్సరాల బాలుడు యూట్యూబ్‌లో హ్యాకింగ్‌ టిప్స్‌ నేర్చుకున్నాడు. బయట ఎక్కడో ఎందుకు... తాను నేర్చుకున్న విద్యకు  ఇంట్లోనే తగిన న్యాయం చేయాలనుకున్నాడు. వెంటనే తండ్రి ఇమెయిల్‌ అకౌంట్‌ను హ్యాక్‌ చేశాడు. దాని పాస్‌వర్డ్‌ మార్చేశాడు. తండ్రికి ఫోన్‌ చేసి 10 కోట్లు డిమాండ్‌ చేశాడు. ‘నేను  హ్యాకర్‌ని. పదికోట్లు ఇవ్వకపోతే మీ కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత సమాచారం, అభ్యంతకరమైన ఫోటోలు ఆన్‌లైన్‌లో పెడతాను’ అని బెదిరించాడు. తండ్రిలబోదిబో అంటూ పోలీస్‌స్టేషన్‌కు పరుగెత్తాడు.

పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ క్రమంలో వారికి ఒక విషయం అర్థమైంది....హ్యాకర్‌ ఎవరో కాదు ఇంటిదొంగే... అని. కుటుంబసభ్యులను విచారించిన తరువాత హ్యాకర్‌ పిల్లాడు దొరికిపోయాడు. చేసిన తప్పును ఒప్పుకున్నాడు.  ‘లాక్‌డౌన్‌ టైమ్‌లో హ్యాకింగ్‌ ట్రిక్స్, సైబర్‌నేరాలకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా చూసేవాడిని’ అని రక్షకభటులకు చెప్పాడు 5వ తరగతి చదువుతున్న మైనర్‌ బాలుడు. ‘ఏదోలే మీ పిల్లాడే కదా’ అని వదిలేయకుండా ఐపీసీలోని రకరకాల సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు.
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top