ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు బెయిల్‌ | Rouse Evenue Court Granted Bail To Kejriwal In Liquor Scam | Sakshi
Sakshi News home page

ఈడీ సమన్ల కేసు: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు బెయిల్‌

Mar 16 2024 10:21 AM | Updated on Mar 16 2024 10:49 AM

Rouse Evenue Court Granted Bail To Kejriwal In Liquor Scam - Sakshi

న్యూఢిల్లీ: ఈడీ సమన్ల కేసు వ్యవహారంలో ఆమ్‌ఆద్మీపార్టీ(ఆప్‌) కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఈ కేసులో బెయిల్‌ మంజూరు అయ్యింది. ఈ కేసులో ఇవాళ ఉదయం ఆయన రౌస్‌ అవెన్యూ కోర్టుకు హాజరవ్వగా.. పూచికత్తుల మీద ఆయనకు బెయిల్‌ మంజూరయ్యింది.

మార్చి 16న వ్యక్తిగతంగా హాజరవ్వాలని రౌస్‌ అవెన్యూ కోర్టు ఇచ్చిన సమన్లపై కేజ్రీవాల్‌ సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్‌ వేశారు. అయితే కోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో ఇవాళ ఆయన ఢిల్లీ కోర్టుకు హాజరుకావాల్సి వచ్చింది. అయితే.. వెంటనే ఆయనకు బెయిల్‌ మంజూరైంది. బెయిల్‌ కోసం రూ.15 వేల పూచికత్తు సమర్పించాలని కోర్టు ఈ సందర్భంగా కేజ్రీవాల్‌ను ఆదేశించింది.

లిక్కర్‌ కేసులో విచారణకు హాజరవ్వాల్సిందిగా తాము పంపిన సమన్లకు కేజ్రీవాల్‌ స్పందించకపోవడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీంతో తమ ఎదుట వ్యక్తిగతంగా హాజరుకావాలని కోర్టు ఆయన్ని ఆదేశించింది. అయితే వర్చువల్‌గా హాజరవుతానన్న ఆయన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. 

ఇదీ చదవండి.. కవితకు వైద్యపరీక్షలు.. ఈడీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement