బం‍జారాహిల్స్‌: మసాజ్‌ సెంటర్‌ ముసుగులో వ్యభిచారం | Prostitution Racket Busted In the Name Of Spa And Salon At Banjara Hills | Sakshi
Sakshi News home page

బం‍జారాహిల్స్‌: మసాజ్‌ సెంటర్‌ ముసుగులో వ్యభిచారం.. 10 మందికి పైగా యువతులను

Nov 23 2021 11:12 AM | Updated on Nov 23 2021 3:10 PM

Prostitution Racket Busted In the Name Of Spa And Salon At Banjara Hills - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: మసాజ్‌ ముసుగులో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ స్పా సెంటర్‌పై హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా మసాజ్‌ సెంటర్‌ నిర్వాహకులతో పాటు ఒక విటుడిని, 10 మందికి పైగా యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారా హిల్స్ రోడ్ నంబర్ 12 లో ‘ఎలిగంట్‌ బ్యూటీ స్పాలూన్‌, అథర్వ హమామ్‌ స్పా’ పేర్లతో మసాజ్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నారు.
చదవండి: మసాజ్‌ సెంటర్ల సీజ్‌.. యువతులు, మహిళలను రప్పించి వ్యభిచారం

అయితే ఈ మసాజ్‌ కేంద్రాల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు కొందరు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు సోమవారం రాత్రి స్పా సెంటర్లపై దాడులు జరిపారు. మసాజ్‌ సెంటర్‌ నిర్వాహకులతో పాటు ఒక విటుడు, పలువురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నిమిత్తం బంజారాహిల్స్‌ పోలీసులకు నిందితులను అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement