కుత్బుల్లాపూర్‌: మసాజ్‌ సెంటర్‌ ముసుగులో వ్యభిచారం

Police raid On Prostitution, Runs in Massage Center In Quthbullapur - Sakshi

సాక్షి, కుత్బుల్లాపూర్‌: మసాజ్‌ సెంటర్‌ ముసుగులో వ్యభిచారం చేయిస్తున్న నిర్వాహకుడు, ఓ విటుడిని పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. గత కొంతకాలంగా వెన్నెలగడ్డ సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌ను అద్దెకు తీసుకుని మసాజ్‌ సెంటర్‌ నిర్వహిస్తూ వస్తున్నారు. అపార్ట్‌మెంట్‌కు వస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో స్థానికులకు అనుమానం కలిగింది. దీంతో గత నెలలో పలుసార్లు ఫిర్యాదు చేయగా పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు.
చదవండి: హైటెక్ వ్యభిచారం.. తప్పించుకోవడానికి రహస్య మార్గం..

ఈ క్రమంలో పేట్‌బషీరాబాద్‌ సీఐ రమేష్‌ ఆధ్వర్యంలో పోలీస్‌ సిబ్బంది మసాజ్‌ సెంటర్‌కు కస్టమర్‌ లాగా వెళ్లి కూపీ లాగారు. ఇక్కడ వ్యభిచార కార్యకలాపాలు సాగుతున్నాయని నిర్ధారించుకున్న అనంతరం పోలీసులు దాడి చేసి నిర్వాహకుడితో పాటు ఓ విటుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా మరో ముగ్గురు మహిళలను రెస్క్యూ హోమ్‌కు తరలించారు. ఈ మేరకు కేసు పోలీసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: తండ్రి గేమ్‌ ఆడొద్దన్నాడని టెన్త్‌ విద్యార్థిని దారుణం..

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top