తల్లిని పెళ్లి చేసుకున్నాడు.. కూతురుపై కన్నేశాడు | POCSO Case registered against CI Sampath | Sakshi
Sakshi News home page

తల్లిని పెళ్లి చేసుకున్నాడు.. కూతురుపై కన్నేశాడు

Mar 23 2024 7:51 AM | Updated on Mar 23 2024 7:54 AM

POCSO Case registered against CI Sampath  - Sakshi

హన్మకొండ: మైనర్‌పై అత్యాచారానికి యత్నించిన ఘటనలో ఓ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ శుక్రవారం అరెస్టయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం.. వివరాలు ఇలా ఉన్నాయి. భూపాలపల్లి జిల్లా సైబర్‌ క్రైంలో బండారి సంపత్‌ సీఐగా విధులు నిర్వహిస్తున్నాడు. వర్ధన్నపేట ఎస్సైగా పనిచేస్తున్న సమయంలో ఓ వివాహితతో ఏర్పడిన పరిచయం లైంగిక బంధానికి దారితీసింది. దీంతో సదరు మహిళ తన భర్తను వదిలిపెట్టి కొంతకాలంగా సంపత్‌తో సహజీవనం సాగించి.. తర్వాత వివాహం చేసుకున్నారు. 

ఆమెకు అప్పటికే పదేళ్ల వయసు కూతురు ఉంది. ప్రస్తుతం ఆ బాలిక ఇంటర్మీడియట్‌ చదువుతోంది. అయితే ఆ బాలికకు తండ్రిగా వ్యవహరించాలి్సన సీఐ కీచకుడిగా మారాడు. ఇటీవల అత్యాచారానికి యత్నించడంతో బాలిక తల్లి కాకతీయ యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో హనుమకొండ ఏసీపీ దేవేందర్‌రెడ్డి విచారణ చేపట్టారు. లైంగిక దాడికి యత్నించినట్లు నిర్ధారణకు వచ్చి సీఐ సంపత్‌పై పోక్సో కేసు నమోదు చేశారు. 

రెండేళ్లక్రితం సంపత్‌పై ఫిర్యాదు..
ఎస్సై బండారి సంపత్‌ మాయమాటలు చెప్పి తన భార్యను తీసుకెళ్లాడని రెండేళ్ల క్రితం అప్పటి పోలీస్‌ కమిషనర్‌ తరుణ్‌జోషిని కలిసి ఆమె భర్త  ఫిర్యాదు చేశాడు. అçప్పుడు కాకతీయ యూనివర్సిటీ ఎస్సైగా విధులు  నిర్వహిస్తున్న సంపత్‌ను ఏఆర్‌కు అటాచ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement