ఆమె వైద్యురాలు, అతడు నైజీరియన్‌: రూ.41 లక్షలు ఇచ్చేసింది 

Nigerian Man Dupes Hyderabad Doctor Of Rs 41 Lakh - Sakshi

సిటీ డాక్టర్‌ను మోసం చేసిన నైజీరియన్‌ 

సాక్షి, హిమాయత్‌నగర్‌: హెర్బల్‌ మందుల వ్యాపారం పేరుతో మెహదీపట్నంకు చెందిన ఓ వైద్యురాలిని నట్టేట ముంచిన నిందితుడిని సిటీ సైబర్‌ క్రైం పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతని వద్ద ఉన్న పలు బ్యాంకులకు చెందిన డెబిట్, క్రెడిట్‌ కార్డులను స్వాదీనం చేసుకుని గురువారం రిమాండ్‌కు తరలించారు. నైజీరియాకు చెందిన మెస్సీ డాన్‌ హో మూడళ్ల క్రితం విజిటింగ్‌ వీసాపై భారత్‌కు వచ్చాడు. వీసా గడువు ముగియడంతో ఢిల్లీలో అనధికారికంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో మెహదీపట్నంకు చెందిన హెర్బల్‌ వైద్యురాలితో ఫేస్‌బుక్‌ ద్వారా ఇటలీ వాసినంటూ పరిచయం పెంచుకున్నాడు. రెండేళ్ల పరిచయంలో ఇటీవల హెర్బల్‌ ఫార్మూలా, మెడిసిన్స్‌ పంపిస్తే తమ దేశంలో వ్యాపారం చేసుకుంటానని, ఇందుకు రూ.5 కోట్లు చెల్లిస్తానడంతో వైద్యురాలు నమ్మింది.

తనపై నమ్మకం వచ్చేలా ఓ ఎకౌంట్‌కు చెందిన డెబిట్‌ కార్డును పంపగా..రూ.4వేలు డ్రా చేసిన వైద్యురాలికి ఢిల్లీ కస్టమ్స్‌ అంటూ ఫోన్‌ కాల్‌ వచ్చింది. మీకు వచ్చిన రూ.5కోట్లు తీసుకోవాలంటూ మెస్సీ డాన్‌ హో నమ్మించారు.  ఇందుకు గాను పలు దఫాలుగా రూ.20లక్షలు బదిలీ చేశారు .ఆ తర్వాత తనతో వచ్చిన కుమార్తె కూడా చనిపోయిందనే నాటకం ఆడటంతో మరో రూ.21లక్షలు బదిలీ చేశారు. డాక్టర్‌  ఇంకా పంపుతూనే ఉండటంతో..ఆమె కుమార్తెకు అనుమానం వచ్చి జూన్‌ 29న సిటీ సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయగా..కేసు నమోదు చేసుకున్న పోలీసులు నైజీరియన్‌ది అంతా డ్రామా, ఇతను ఇటలీ వాసి కాదని, ఇప్పటికే పలువురిని మెసం చేశాడనే విషయాలను రాబట్టి ఢిల్లీలో అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఒక ల్యాప్‌టాప్, మూడు సెల్‌ఫోన్లు, 37 డెబిట్, క్రెడిట్‌ కార్డులు, 13 బ్యాంకు పాస్‌బుక్స్, 12 బ్యాంక్‌ చెక్కులు, పలు సిమ్ములు స్వాధీనం చేసుకున్నారు. 

నగరవాసిపై సైబర్‌నేరస్తుల వల 
హిమాయత్‌నగర్‌: లాభాల ఆశ చూపించి 19 మంది నుంచి రూ.12.30 లక్షలు స్వాహా చేశాడో సైబర్‌ నేరస్తుడు. సికింద్రాబాద్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు, వారి బంధువులు 13 కలిసి  యాప్‌లలో పెట్టుబడి పెట్టేందుకు ప్రయతి్నంచారు. వీరికి ఓ వ్యక్తి పరిచయమై  తొలుత రూ.10వేలు కట్టాలన్నాడు. అవినాష్‌ రూ.10వేలు కట్టగా లాభం రూ.1లక్ష వచ్చింది. దీంతో అందరూ కట్టారు. ఇలా 12.30 లక్షలు చెల్లించారు. లాభం రాకపోవడంతో బాధితులు సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

గూగుల్‌లో విమాన టికెట్ల కోసం వెతికిన బోయినపల్లి వాసి మౌనికకు గుర్తుతెలియని వ్యక్తి ఫోన్‌ చేశాడు. ప్రయాణ ఆఫర్లు ఉన్నాయని నమ్మించి రూ.1.08 లక్షలు స్వాహా చేశాడు.ఇంజనీరింగ్‌ పూర్తిచేసిన సనత్‌నగర్‌ వాసి అనురాధ తన రెజ్యూమ్‌ను క్విక్కర్‌ డాట్‌కామ్‌లో పోస్ట్‌ చేసింది. కన్సల్టెన్సీ పేరుతో ఓ వ్యక్తి కాల్‌ చేశాడు. వివిధ ఫీజుల పేర్లతో రూ.96వేల 500కాజేశాడు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top