చోరీకి పాల్పడిన నేవీ అధికారి.. సొత్తును పొదల్లో దాచి.. చివరికి

Navy Man Arrested For Gold Robbery In Visakhapatnam - Sakshi

అప్పులు తీర్చుకునేందుకు చోరీకి పాల్పడిన నేవీ సైలర్

నేరంలో భర్తకు సహకరించిన భార్య

చోరీ సొత్తును పొదల్లో దాచిన నిందితులు

అతను రక్షణ రంగంలో ఉద్యోగి.  ప్రేమ వివాహంతోపాటు ఉమ్మడి కుటుంబం. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. షేర్ మార్కెట్ అలవాటు అతన్ని తప్పుడు ఆలోచనలకు దారి తీసింది. పర్యావసానంగా ఓ బంగారం దుకాణంలో చోరీకి పాల్పడ్డాడు. పెళ్లి నాడు నాతిచరామి అని ప్రమాణం చేసి నట్టు ఈ దొంగతనంలో భార్య సహకారాన్ని కూడా తీసుకున్నాడు. చివరికి ఇద్దరు కలిసి పోలీసులకు చిక్కారు.

సాక్షి, విశాఖపట్నం: బిహర్‌కు చెందిన రాజేష్ ఇండియన్ నేవీలో సైలర్‌గా పనిచేస్తున్నాడు. ఇతని భార్య అమ్రిత పూనమ్.. వీరిద్దరిదీ ప్రేమ వివాహం. కాగా రాజేష్‌ది ఉమ్మడి కుటుంబం. అక్క, చెల్లెలు, అమ్మ నాన్నతో కలిసి ఏడుగురు సంతానం. దీనికి తోడు ఇటీవల షేర్ మార్కెట్లో చాలావరకు డబ్బు పోగొట్టుకున్నాడు. మొత్తంగా దాదాపు 10 లక్షలు అప్పులు పాలయ్యాడు. ఈ దశలో విశాఖ నుంచి ముంబైకి బదిలీ అయింది. అప్పుల బెడద తీవ్రం కావడంతో రాజేష్‌ తప్పుడు ఆలోచనలు చేశాడు.

గోపాలపట్నం సమీపంలో ఉన్న శ్రీ జ్యుయలరీలో చోరీకి పాల్పడ్డాడు. 4.50 కిలోల వెండితో పాటు 90 వేల నగదుతోపాటు కొంత బంగారు నగలు చోరీ చేశాడు. ఈ చోరీ సొత్తును నేరుగా ఇంటికి తీసుకు వెళ్ళకుండా ఎయిర్‌పోర్టు సమీపంలో ఉన్న పొదలో దాచారు. కానీ బంగారు దుకాణంలో చోరీపై విచారణ చేసిన పోలీసులకు సీసీఫుటేజ్‌లో రాజేష్ అతని భార్య ఆనవాళ్లు బయటపడ్డాయి. దీంతో పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.

చదవండి: బార్‌లో వ్యభిచారం.. ఇద్దరు యువతులు, నిర్వాహకుల అరెస్ట్‌ 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top