ఘోరం: కలుద్దామని పిలిచి... కత్తితో దాడిచేసిన ఇక్బాల్‌ షేక్‌

Mumbai Man Stabbed His Wife Argument Over Sons Custody - Sakshi

ఇటీవలకాలంలో పలు జంటలు ఏవేవో కారణాలతో విడాకులు తీసుకుంటున్నారు. దీంతో వారికి పుట్టిన పిల్లల విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం తలెత్తడం తదనంతరం ఒకరినోకరు చంపుకునే  స్థితికి చేరుకుంటున్నారు. దీంతో ఇరు జీవితాలు నాశనమవ్వడం తోపాటు వారి పిల్లలు అనాథలుగా మారిపోతున్నారు. అచ్చం అలాంటి ఘటనే ముంబైలో చోటు చేసుకుంది.

వివరాల్లోకెళ్తే...పోలీసుల కథనం ప్రకారం...ముంబైలోని 36 ఏళ్ల ట్యాక్సీ డ్రైవర్‌ ఇక్బాల్‌ షేక్‌ హిందు మహిళ రూపాలిని 2019లో పెళ్లి చేసుకున్నాడు. రూపాలి అతన్ని పెళ్లి చేసుకోవడంతోనే తన పేరును జరా గా మార్చుకుంది. ఆ తర్వాత వారికి 2020లో ఒక కొడుకు జన్మించాడు. మొదట్లో అంతా బాగానే ఉంది. రానురాను ఇక్బాల్‌ బురఖా ధరించాలంటూ ఒత్తిడి చేయడం ప్రారంభించాడు.

అందుకు అంగీకరించని రూపాలి తన కుమారుడిని తీసుకుని విడిగా ఉంటోంది. ఐతే ఇక్బాల్‌ షేక్‌ విడాకులు తీసుకునే విషయమై చర్చించేందుకు కలుద్దాం అంటూ ఆమెని పిలిపించాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య కొడుకు కస్టడీ విషయమై వాగ్వాదం తలెత్తింది. అంతే ఒక్కసారిగా ఇక్బాల్‌ కోపంతో కత్తి తీసుకుని రూపాలిని పలుమార్లు పొడిచాడు. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందింది. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్‌ అధికారి విలాస్‌ రాథోడ్‌ తెలిపారు. నిందితుడు ఇక్బాల్‌ షేక్‌ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. 
(చదవండి: యువకుడు సజీవ సమాధి...పోలీస్‌ ఎంట్రీతో తప్పిన ప్రమాదం)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top