భర్త సంసారానికి పనికి రాడని చెప్పి.. జాతరకు వెళ్లి..

Married Woman Manasa Commits Suicide in Hyderabad - Sakshi

సాక్షి, హస్తినాపురం (హైదరాబాద్‌): భర్త వేధింపులతో తన కూతురు మృతి చెందిందని తల్లిదండ్రులు, బంధువులు సోమవారం వనస్థలిపురం పోలీస్‌ స్టేషన్‌ ముందు ఆందోళనకు దిగారు. మృతురాలి భర్త దేవిరెడ్డి, మామ జంగారెడ్డి పోలీస్‌ స్టేషన్‌లో తలదాచుకోవడం ఏంటని బంధువులు పెద్దఎత్తున తరలివచ్చి స్టేషన్‌ ముందు బైఠాయించారు. వివరాలు ఇలా.. మాడ్గుల మండలం అర్కపల్లికి చెందిన మానసను వనస్థలిపురం క్రిష్టియన్‌కాలనీకి చెందిన దేవిరెడ్డితో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది.

దేవిరెడ్డి మెడికల్‌ కంపెనీలో పని చేస్తుండగా మానస ప్రైవేటు ఉద్యోగం చేస్తోంది. అయితే... దేవిరెడ్డి సంసార జీవితానికి పనికిరాడని మానస తల్లిదండ్రులకు చెప్పగా కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో కోసం పెంచుకున్న దేవిరెడ్డి మానసను పలుమార్లు కొట్టడంతో పెద్దల సమక్షంలో ఇరువురికి నచ్చజెప్పారు. ఈ విషయమై 2021లో దేవిరెడ్డిపై మహిళా పోలీస్‌ స్టేషన్‌ లో ఫిర్యాదు చేశారు.

చదవండి: (నవమి వేడుకల్లో ఘర్షణలు)

నాటి నుంచి తల్లిదండ్రుల వద్ద ఉంటున్న మానస ఈ నెల 9న మెదక్‌ జిల్లాలోని ఏడుపాయల జాతరకు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లింది. అక్కడ మానస అపస్మారక స్థితిలో వెళ్లడంతో వెంటనే అక్కడి ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లడంతో అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కుటుంబ సభ్యులు నగరంలోని గాంధీ ఆసుపత్రికి తీసుకురాగా మానస అప్పటికే మృతిచెందినట్లు ధ్రువీకరించారు. గత మూడ్రోజులుగా మానసిక క్షోభతో మృతి చెందిన మానస మృతదేహానికి భర్త దేవిరెడ్డి అంత్యక్రియలు జరపాలని డిమాండ్‌ చేయడంతో ఇంటికి తాళం వేసి వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌లో ఉండడంతో మృతురాలి బంధువులు స్టేషన్‌ ముందు ధర్నాకు దిగారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top