రంగారెడ్డి: ప్రేమపేరుతో మైనర్‌ బాలికపై లైంగికదాడి, అబార్షన్‌

Man Molested Minor Girl And Had An Abortion In Kadthal, Ranga Reddy - Sakshi

సాక్షి, కడ్తాల్‌: ప్రేమపేరుతో బాలికపై లైంగిక దాడికి పాల్పడి గర్భం దాల్చడానికి కారకుడైన నిందితుడితో పాటు, గర్భస్రావం చేసిన ఎంబీబీఎస్‌ వైద్యురాలు, సహకరించిన ఆర్‌ఎంపీ వైద్యుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల కడ్తాల్‌ మండలంలో గిరిజన బాలికపై జరిగిన లైంగిక దాడి కేసుకు సంబంధించిన వివరాలను ఆమనగల్లు సీఐ ఉపేందర్, కడ్తాల్‌ ఎస్‌ఐ హరిశంకర్‌గౌడ్‌ వెల్లడించారు. కడ్తాల్‌ మండలంలోని ఓ తండాకు చెందిన బాలిక(17) ఇంటర్‌ చదువుతోంది. అదే తండాకు చెందిన వివాహితుడు సభవట్‌ రవీందర్‌(21) బాలికతో రెండేళ్లుగా పరిచయం పెంచుకున్నాడు.
చదవండి: మూడేళ్ల ప్రేమ.. ఇంకొకరితో నిశ్చితార్థం జరగడంతో..

ప్రేమపేరుతో మాయమాటలు చెప్పి లొంగదీసుకోవడంతో ఆమె గర్భం దాల్చింది. ఓ ఆర్‌ఎంపీ సాయంతో హైదరాబాద్‌లోని ఓ ఎంబీబీఎస్‌ డాక్టర్‌ను సంప్రదించి గర్భస్రావం చేయించాడు. ఈ సంఘటనపై విద్యారి్థని తల్లిదండ్రులు ఈనెల 25న కడ్తాల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఎస్‌ఐ హరిశంకర్‌గౌడ్‌  కేసు నమోదు చేశారు. బాలికను గర్భవతిని చేసిన నిందితుడు సభావట్‌ రవీందర్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. గర్భస్రావం కోసం నిందితుడు ఇబ్రహీంపట్నం మండలం కప్పపహాడ్‌ గ్రామానికి చెందిన ఆర్‌ఎంపీ జంగిల్‌ రంజిత్‌ కుమార్‌ను సంప్రదించాడు.
చదవండి: విడాకులు ఇవ్వట్లేదని.. ప్రియుడితో కలిసి భర్త కిడ్నాప్‌ 

అతడు బాలికను పరీక్షించి ఐదునెలల గర్భవతి అని నిర్ధారించాడు. తాను మధ్యవర్తిత్వం వహించి హైదరాబాద్‌లోని పల్లె జ్యోతి అనే ఎంబీబీఎస్‌ వైద్యురాలిని సంప్రదించాలని సూచించాడు. రవీందర్‌ బాలికను డాక్టర్‌ వద్దకు తీసుకెళ్లగా ఆమె అబార్షన్‌ చేసింది. ఈమేరకు ముగ్గురిని అరెస్ట్‌ చేశామని పోలీసులు తెలిపారు. ఏ1గా సభావట్‌ రవీందర్, ఏ2గా ఆర్‌ఎంపీ జంగిల్‌ రంజిత్‌కుమార్, ఏ3గా ఎంబీబీఎస్‌ వైద్యురాలిపై కేసు నమోదు చేసి వారిని రిమాండుకు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు.
చదవండి: దుర్గగుడి ఫ్లైఓవర్‌పై రేసింగ్‌ విన్యాసాలు: ‘క్రిమినల్‌ కేసు నమోదు’ 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top