వ్యక్తికి తీవ్ర గాయాలు

Man Jumps From Malakpet Metro Station - Sakshi

ఉస్మానియా ఆసుపత్రికి తరలింపు

సాక్షి, మలక్‌పేట: మద్యం మత్తులో ఓ వ్యక్తి మెట్రోస్టేషన్‌ పైనుంచి దూకిన ఘటన మలక్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. చత్తీస్‌ఘడ్, కువకొండ, పుల్‌పహడ్, దంతేవాడకు చెందిన భీమా(45) ఫుట్‌పాత్‌పై నివాసం ఉంటున్నాడు. దిల్‌సుఖ్‌నగర్‌ బస్టాప్‌ వైపు నుంచి మెట్రో స్టేషన్‌ మొదటి ఫ్లోర్‌ ఎక్కి అక్కడ నుంచి దూకాడు.
చదవండి: అత్యాచార ఘటన చాలా బాధాకరం: ఎమ్మెల్సీ కవిత

అతడి తల, ఎడమ చేతికి గాయాలయ్యాయి. ఘటన స్థలానికి చేరుకున్న మలక్‌పేట పోలీసులు 108 అంబులెన్స్‌లో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. సీసీఫుటేజ్‌లు పరిశీలించారు. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top