
మణికొండ: ప్లైఓవర్‌పై నుంచి ఔటర్‌రింగ్ రోడ్డుపైకి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నారాయణపేట్ జిల్లా, మద్డూరు మండలం, చింతల్‌పేట్ గ్రామానికి చెందిన భీమప్ప(30) గత కొంత కాలంగా నార్సింగి మున్సిపల్ కేంద్రంలో నివాసం ఉంటున్నాడు. మంగళవారం రాత్రి అతను స్థానిక ఫ్లై ఓవర్‌పై నుంచి ఔటర్ రింగ్‌రోడ్డుపైకి దూకాడు. తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
(చదవండి: ప్రాణాలు తీసిన వేగం)