కొద్దిరోజుల్లో బీజేపీలోకి.. ఈలోగా దారుణ హత్య.. | Karnataka Former Jds Leader Hacked To Death Ahead Joining Bjp | Sakshi
Sakshi News home page

కొద్దిరోజుల్లో బీజేపీలోకి.. ఈలోగా దారుణ హత్య..

Nov 16 2022 8:24 PM | Updated on Nov 16 2022 8:24 PM

Karnataka Former Jds Leader Hacked To Death Ahead Joining Bjp - Sakshi

బెంగళూరు: కొద్ది రోజుల్లో బీజేపీలో చేరబోతున్న జేడీఎస్ మాజీ నాయకుడు దారుణ హత్యకు గురికావడం కర్ణాటకలో చర్చనీయాంశమైంది. మృతుడు మల్లికార్జున్ ముత్యాల్(64) మర్మాంగంపై కత్తిపోట్లు ఉండటం కలకలం రేపింది. ఆయన మెడకు తాడు కూడా బిగించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

మల్లికార్జున్‌ యజమానిగా ఉన్న ఎలక్ట్రానిక్ షాపు వెనుకాలే ఈ హత్య జరిగింది. అతను రాత్రివేళ  నిద్రించే సమయంలో దుండగులు ఈ కిరాతక చర్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

ముత్యాలు ఇటీవలే జేడీయఎస్‌కు గుడ్‌బై  చెప్పారు.  కొద్దిరోజుల్లో బీజేపీలో చేరబోతున్నారు. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై హాజరైన ఓ కార్యక్రమంలో కూడా ఇటీవలే పాల్గొన్నారు. 

అయితే షాపులో దొంగతనానికి వచ్చినవారే మల్లికార్జున్‌ను హత్య చేసి ఉంటారని అతని కుమారుడు అనుమానిస్తున్నాడు. గతంలోనూ ఓసారి దొంగలు చోరీకి ప్రయత్నించారని పేర్కొన్నాడు.
చదవండి: ఢిల్లీ హత్యోదంతం.. ఆ ఒక్క అబద్దమే అతడ్ని పట్టించింది..

Advertisement
 
Advertisement
Advertisement