Amnesia Pub Case: సాదుద్దీన్‌ కస్టడీ విచారణలో సంచలన విషయాలు

Jubilee Hills Amnesia Pub Case: A1 Accused Asaduddin Ful Custody Report - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ కేసులో ప్రధాన నిందితుడు సాదుద్దీన్‌ పోలీస్‌ కస్టడీ రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఈ కేసులో శాస్త్రీపురం కార్పొరేటర్‌ కుమారుడు అసలు సూత్రధారి అని సాదుద్దీన్‌ పోలీసులకు వివరించాడు. కార్పొరేటర్‌ కుమారుడు, ఎమ్మెల్యే కొడుకు పబ్‌లోకి ఎంటర్‌ కాగానే అమ్మాయిలను వెతకడం ప్రారంభించారని, పబ్‌లోనూ మైనర్‌ అమ్మాయిలను వేధించినట్లు పేర్కొన్నాడు. 

‘పబ్‌ నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యే కొడుకు, కార్పొరేటర్‌ కొడుకు మైనర్‌ వెంట పడ్డారు. నేను వారిని వద్దని వారించాను. దీంతో నన్ను బెంజ్ కారులో ఎక్కొద్దని ఎమ్మెల్యే కొడుకు ఆదేశించాడు. నన్ను పబ్‌ దగ్గర వదిలి అమ్మాయిని బెంజ్‌ కారులో ఎక్కించుకున్నాడు. నేను బెంజ్‌ కారులో కాకుండా ఇన్నోవాలో బేకరికి వెళ్లాను. బెంజ్ కారులోకి ఎక్కగానే మైనర్ అమ్మాయిని ఏమ్మెల్యే కుమారుడు వేధించడం ప్రారంభించాడు. మార్గ మధ్యలో ఇద్దరు, మరొక ముగ్గురు పెద్దమ్మతల్లి ఆలయం పక్కన ఖాళీ స్థలంలో అఘాయిత్యానికి ఒడిగట్టారు. నా ఫ్రెండ్స్‌ బలవంతం కారణంగానే నేనూ ఈ అత్యాచారం చేయాల్సి వచ్చింది. వారి ప్రోద్బ‌లంతోనే ఇదంతా జరిగింది’ అని సాదుద్దీన్‌ పోలీసుల ముందు తెలిపాడు.
సంబంధిత వార్త: జూబ్లీహిల్స్‌ అమ్నీషియా పబ్‌ కేసు: అత్యాచార ఉద్ధేశంతోనే పబ్‌కు

అయితే అత్యాచారంలో ఎవరి పాత్ర ఎంత ఉందనేది పోలీసులు తేల్చారు. శాస్త్రీపురం కార్పొరేటర్‌ కుమారుడు ఈ కేసులో అత్యంత కీలక సూత్రధారి అని అతని తరువాత సాదుద్దీన్‌, వక్ఫ్‌బోర్డ్‌ చైర్మన్‌ కొడుకు, ఎంఐఎం ఎమ్మెల్యే సోదరి కొడుకు,  సంగారెడ్డి కార్పొరేటర్‌ కొడుకు, ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు ఉ‍న్నట్లు తెలిపారు

నిందితుల మధ్య ఘర్షణ
మరోవైపు జూబ్లీహిల్స్‌ పబ్‌ కేసులోని నిందితుల మధ్య ఘర్షణ జరిగింది. జువైనల్‌ హోంలో ఉన్న  ఐదుగురు మైనర్లు ప్లేట్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. శాస్త్రిపురం కార్పొరేటర్‌ కుమారుడు సాదుద్దీన్‌ టార్గెట్‌గా ఈ దాడి జరిగింది. నీ వల్లే విషయం బయటకు వచ్చిందని సాదుద్దీన్‌పై మిగతా నిందితులు దాడి చేశారు. చివరికి పోలీసులు జోక్యం చేసుకోవడంతో ఈ వివాదం సద్దుమణిగింది. 

సాదుద్దీన్‌కు రిమాండ్‌
అమ్నీషియా పబ్‌ అత్యాచార కేసులో ప్రధాన నిందితుడు సాదుద్దీన్‌ మాలిక్‌కు 14 రోజుల రిమాండ్‌ విధించింది. దీంతో నాంపల్లి కోర్టు నుంచి చంచల్‌గూడ జైలుకు సాదుద్దీన్‌ను తరలించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top