ఐటీ ఉద్యోగి దారుణహత్య  | IT Employee Assassination In Tiruvallur Over Land Dispute | Sakshi
Sakshi News home page

ఐటీ ఉద్యోగి దారుణహత్య 

Published Tue, Jan 4 2022 6:51 AM | Last Updated on Tue, Jan 4 2022 6:51 AM

IT Employee Assassination In Tiruvallur Over Land Dispute - Sakshi

తిరువళ్లూరు: భూతగాదాల కారణంగా సొంత అన్న కూతురిని బాబాయి దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా కూవం నది పరివాహక ప్రాంతానికి చెందిన లోకనాయగి.. భర్త ఇటీవల మృతి చెందిన నేపథ్యంలో కూతురు శివరంజనితో కలిసి నివాసం ఉంటున్నారు. బీసీఏ పూర్తి చేసిన శివరంజిని చెన్నైలోని ఐటీ కంపెనీలో పని చేస్తోంది. శివరంజిని తల్లిదండ్రులకు చిన్నాన్న బాలచంద్రన్‌కు మధ్య భూతగాదా ఉన్నట్లు తెలుస్తుంది.

సోమవారం ఇరు కుటుంబాలు స్వల్పంగా ఘర్షణకు దిగారు. దీంతో మనస్థాపం చెందిన లోకనాయగి తన మరిది బాలచంద్రన్‌పై ఫిర్యాదు చేయడానికి తిరువళ్లూరు టౌన్‌ పోలీసు స్టేషన్‌కు వెళ్లింది. దీంతో బాలచంద్రన్‌ ఆగ్రహంతో ఇంట్లోకి చొరబడి  శివరంజినిని విచక్షణా రహితంగా నరికి హత్య చేశాడు. అనంతరం పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. లోకనాయగి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement