ప్రియునితో భార్య రాసలీలలు.. అత్త ఛాలెంజ్‌.. ఆ అల్లుడు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని

Husband Catch Wife Extra Marital Affair In Mulugu District - Sakshi

సాక్షి, ములుగు జిల్లా: ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఉద్యోగం రీత్యా వేర్వేరుగా ఉంటున్నారు. ఆ ఎడబాటు కాస్త అక్రమ సంబంధానికి దారి తీసింది. భార్యపై అనుమానంతో పలుమార్లు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ నిర్వహించారు. అనుమానం కాదు, రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని నిరూపించాలని భార్య, ఆమె తల్లితో పాటు పెద్ద మనుషులు సూచించారు. దీంతో భర్త నిఘా పెట్టి భార్య బండారాన్ని బయట పెట్టాడు.
చదవండి: హాస్టల్‌ సమీపంలో గుట్టుచప్పుడు కాకుండా  వ్యభిచారం 

ములుగు జిల్లాలోని  దొడ్ల ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న చీమల సుమలత, చర్ల కార్యదర్శిగా పనిచేసే పాయం పురుషోత్తం ప్రేమించుకున్నారు. గత 8 ఏళ్ల క్రితం పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఉద్యోగాల రిత్యా సుమలత చిన్నబోయినపల్లిలో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటుండగా.. పురుషోత్తం చర్లలో ఉంటున్నాడు. అయితే.. ఇటీవల భార్య-భర్తల మధ్య ఏర్పడిన అనుమానం.. గొడవలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో తన ఇంటర్ క్లాస్‌మెంట్‌ లింగరాజుతో సుమలత సన్నిహితం పెంచుకుంది. దీంతో భర్త పురుషోత్తం అనుమానం మరింత పెరిగింది.

ప్రవర్తన మార్చుకోవాలని.. పలు మార్లు భార్యను హెచ్చరించాడు.. భర్త పురుషోత్తం. అయినా ఆమె తీరులో మార్పు రాలేదు. దీంతో పెద్ద మనుషుల సమక్షంలోనే పంచాయితీ పెట్టించాడు. ఆ సమయంలో సుమలత తల్లి సూటిపోటి మాటలతో పురుషోత్తంని నిందించి, అనుమానం కాదు అవసరమైతే రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని నిరూపించాలని సూచించింది. పురుషొత్తం భార్యపై నిఘా పెట్టి.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నర్సాపూర్‌లోని ఓ ఇంట్లో సుమలత, లింగరాజుతో కలిసి ఉండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. ఆ తర్వాత గ్రామ పెద్దలు, సుమలత కుటుంబ సభ్యుల సమక్షంలోనే వారిని పోలీసులకు అప్పగించిన్నట్లు భర్త పురుషోత్తం తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top