మైనర్‌ బాలికకు మాయమాటలు చెప్పి.. ఐదుగురు కలిసి ఇంట్లో బంధించి..

Five Including A Minor Allegedly Rape A Minor Girl In Rajasthan - Sakshi

జైపూర్‌: రాజస్థాన్‌లో మైనర్‌ బాలికపై ఇంటి పక్కనే ఉండే కొందరు యువకులు అఘాత్యానికి పాల్పడ్డారు. పనికోసం వెళ్లిన ఆ బాలిక అవసరాన్ని ఆసరాగా చేసుకుని.. ఆమెకు  మాయమాటలు చెప్పారు. అంతటితో ఆగకుండా.. ఆ బాలికను నమ్మించి సాముహిక అత్యాచారం చేశారు. గత గురువారం (ఆగస్టు26)న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సంఘటన నాగౌర్‌ జిల్లాలో జరిగింది. కాగా, 16 ఏళ్ల మైనర్‌ బాలిక.. పనికోసం తన ఇంటి పక్కన ఉండే హరిప్రసాద్‌ దగ్గరకు వెళ్లింది. ఆ సమయంలో రామేశ్వర్‌, తన మిత్రులతో కలిసి ఇంట్లో  ఉన్నాడు. వారు బాలికకు మాయమాటలు చెప్పి ఇంట్లో కూర్చోబెట్టారు. ఆ తర్వాత బాలికను ఒక గదిలో  బంధించారు. వారంతా కలసి బాలికపై అత్యాచారం చేశారు. అంతటితో ఆగకుండా.. విషయం ఎవరికైన చెబితే చంపేస్తామని బెదిరింపులకు గురిచేశారు.

దీంతో బాధితురాలు తన ఇంటికి చేరుకుంది. ఈ క్రమంలో..  బాలిక గత కొన్ని రోజులుగా ఒంటరిగా ఉంటుంది. తీవ్ర ఒత్తిడికి గురవ్వటాన్ని ఆమె తల్లిదండ్రులు గుర్తించారు. దీంతో యువతిని కారణం అడిగారు.  ఆ తర్వాత యవతి జరిగిన దారుణాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. తనపై ఐదురుగు యువకులు అత్యాచారం చేశారని కన్నీటి పర్యంత మయ్యింది.

వెంటనే బాధితురాలి తండ్రి, తన కూతురితో కలిసి స్థానిక పోలీస్‌ స్టేషన్‌ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు  ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు  కేసు నమోదు చేశారు. నిందితులకోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నామని స్థానిక పోలీసులు తెలిపారు. వారిలో ఒకరు మైనర్‌ బాలుడు ఉన్నట్లు తెలిపారు. మరికొంత మంది నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని నాగౌర్‌ పోలీసు అధికారి రామేశ్వర్‌ లాల్‌ పేర్కొన్నారు. 

చదవండి: ప్రియుడి కోసం బిడ్డను హింసించిన తల్లి.. అరెస్ట్ చేసిన పోలీసులు

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top