అమానవీయం: తల్లిపై కొడుకు అసభ్యకర ప్రవర్తన, లైంగిక వేధింపులు | Father Assassinated Son Due To Misbehave With Mother In Mahabubabad | Sakshi
Sakshi News home page

అమానవీయం: తల్లిపై కొడుకు అసభ్యకర ప్రవర్తన, లైంగిక వేధింపులు

Feb 11 2022 3:44 PM | Updated on Feb 11 2022 4:06 PM

Father Assassinated Son Due To Misbehave With Mother In Mahabubabad - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, వరంగల్‌: నవ మాసాలు మోసి కనిపెంచిన తల్లి పట్ల ఓ కామాంధ కొడుకు కొద్దిరోజులుగా అసభ్యకరంగా ప్రవర్తిస్తూ.. లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నాడు. ఆగ్రహంతో ఉన్న తండ్రి .. ఆ కొడుకును నరికి చంపాడు. ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం నల్లెల్ల శివారు గాజాతండాలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. సీరోలు ఎస్‌ఐ లావుడ్య నరేష్‌ తెలిపిన కథనం ప్రకారం.. తండాకు చెందిన దారావత్‌ రమేష్‌ (36) భార్యాపిల్లలతో నెల్లికుదురు మండలం వావిలాల గ్రామంలో ఉంటున్నాడు. ఆరు నెలల క్రితం భార్య అతన్ని విడిచి వెళ్లిపోయింది. దీంతో అతను గాజాతండాకు వచ్చి తల్లిదండ్రులు భాషా, అచ్చాలు వద్ద ఉంటున్నాడు. భార్య పోయిందని మద్యానికి బానిసైన రమేశ్‌ రోజూ ఇంట్లో తల్లిదండ్రులతో గొడవ పడుతున్నాడు.

ఈ క్రమంలో తల్లి అచ్చాలి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం తండ్రి భాషాకు పింఛన్‌ డబ్బులు వచ్చాయి. ఆ డబ్బులు రావడంతో తండ్రితో గొడవపడ్డాడు. గొడవలు పడుతుండడం, తల్లిని లైంగికంగా వేధిస్తుండడంతో ఆగ్రహంతో ఉన్న తండ్రి భాషా ఇంట్లో ఉన్న గొడ్డలితో కొడుకు రమేష్‌ గొంతు, మెడపై నరికాడు. రమేష్‌ అక్కడిక్కడే మృతి చెందాడు. కొడుకును నరికి చంపిన విషయం తండాలో తెలియడంతో వెంటనే సీరోలు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఎస్సై లావుడ్య నరేష్‌ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. విషయాన్ని మరిపెడ సీఐ సాగర్‌కు వివరించడంతో ఆయన సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. హత్యకు ఉపయోగించిన గొడ్డలిని స్వాధీనం చేసుకున్నారు. శవ పంచనామా చేసి పోస్టుమార్టం నిమిత్తం మానుకోట ఏరియా ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేష్‌ తెలిపారు. హత్య చేసిన తండ్రి భాషాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement