తీరని విషాదం: పెళ్లి చేద్దామన్న సంతోషంలో ఉండగా..

Couple Allegedly Ends Life By Hanging To Tree Nabarangpur Odisha - Sakshi

ప్రేమజంట ఆత్మహత్య!?

జయపురం/ఒడిశా: పెళ్లికొడుకు నచ్చకో, ప్రియుడిని వదులుకోలేకో కానీ కొద్ది రోజుల్లో వివాహం జరగనున్న ఓ యువతి ప్రియుడితో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో తల్లిదండ్రులతో పాటు గ్రామమంతా తీవ్ర విషాదంలో మునిగిపోయింది. నవరంగపూర్‌ జిల్లా ఉమ్మరకోట్‌ సమితి ముర్తుమా గ్రామంలో సోమవారం జరిగిన ఈ విషాద సంఘటన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన సొస్మిత మఝి అనే యువతికి ఉమ్మరకోట్‌ సమితి సుకిగాం పంచాయతీ డాబిడగుడ గ్రామానికి చెందిన యువకుడితో వివాహం నిశ్చయమైంది. వారి వివాహం కొద్ది రోజుల్లో జరగనుండడంతో ఉభయుల కుటుంబసభ్యులు ఏర్పాట్లలో మునిగి ఉన్నారు.

అయితే ఉమ్మరకోట్‌ సమితి బొడొకుముడి గామ పంచాయతీ సనకుముడి గ్రామానికి చెందిన జుధిష్ట గొండ్‌ అనే యువకుడిని సొస్మిత గాఢంగా ప్రేమిస్తోంది. ఈ క్రమంలో తల్లిదండ్రులు కుదిర్చిన సంబంధం ఇష్టంలేకనో, కుటుంబసభ్యులకు చెప్పలేకనో మనస్తాపం చెంది ప్రియుడితో కలిసి ఉరివేసుకుని ఆత్యహత్యకు పాల్పడింది. విషయాన్ని గమనించిన గ్రామస్తులు ఉమ్మరకోట్‌ పోలీసులు తెలియజేయగా వచ్చి మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం తరలించారు. సంఘటన స్థలంలో కొన్ని కేకులు, మూడు పురుగు మందు సీసాలతో పాటు యువతి చెప్పులు, ఒక సైకిల్‌ పడి ఉన్నాయి. వాటిని పోలీసులు సీజ్‌ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అన్ని కోణాల్లోనూ విచారణ చేపట్టారు. 

చదవండి: కనిపించకుండా పోయి అడవిలో శవమై కనిపించింది..

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top