తోడి కోడళ్ల సిగపట్లు.. మధ్యలోకి వెళ్లిన మామ, చిన్నకోడలు కాలితో తన్నడంతో కోపంతో రగిలిపోయి..

UP cops father beheads daughter in law Surrenders - Sakshi

ఆగ్రా: అత్తింటిలో దీపం పెట్టడానికి వచ్చిన తోడి కోడళ్ళు పందెం కోళ్లలా గొడవపడుతుంటే విడదీసే ప్రయత్నంలో మామగారు చిన్న కోడలి తల నరికేశాడు. అనంతరం ఆగ్రా జిల్లాలోని కిరావాలి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. హంతకుడి చిన్నకొడుకు, మృతురాలి భర్త ఫరూఖాబాద్లో పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. 

పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన రఘువీర్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం.. ఆగ్రాలోని మాలిక్ పూర్ గ్రామంలో నివాసముండే రఘువీర్ (62)కు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు చనిపోగా అతని భార్య తమతోనే ఉంటోందని.. ఆమెతో చిన్న కోడలు ప్రియాంక సింగ్ (28) తరచూ గొడవపడుతూ ఉండేదని చెప్పాడు. వారిని కలిసి ఉండాలని ఎంత చెప్పినా వినేవారు కాదని పోలీసులకు తెలిపాడు రఘువీర్. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి ఇద్దరి కోడళ్ల మధ్య వాగ్వాదం చెలరేగిందని, ఇద్దరూ సిగపట్లు పట్టుకున్నారని..  విడదీసేందుకు మధ్యలోకి వెళ్లిన రఘువీర్ ను ప్రియాంక కాలితో తన్నగా.. దూరాన పడిన మామగారు కోపోద్రిక్తుడై గొడ్డలి అందిపుచ్చుకుని చిన్న కోడలి మెడ మీద వేటు వేశాడని.. దాంతో ఆమె తల మొండెం రెండూ వేరై అక్కడికక్కడే చనిపోయిందని తెలిపారు. మృతురాలు ప్రియాంక సింగ్ తండ్రి ఫిర్యాదు ప్రకారం తండ్రీ, కొడుకులు ఇద్దరి పైనా  కేసులు నమోదు చేశారు పోలీసులు.  
ఇది కూడా చదవండి: 5 గంటల్లో రూ.40..  కర్ణాటక ఆటో డ్రైవర్ల దయనీయ స్థితి..

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top