వ్యాపారి మధుసూదన్‌రెడ్డి హత్య కేసులో నలుగురు ప్రమేయం!

Business Man Assasinate Tragedy In Hyderabad - Sakshi

హైదరాబాద్‌:  అప్పుగా ఇచ్చిన సొమ్మును తిరిగి ఇవ్వమన్నందుకు వ్యాపారి మధుసూదన్‌ రెడ్డిని స్నేహితులే పథకం ప్రకారం హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్దారించారు.  ఈ కేసులో ప్రధాన నిందితుడు జగన్నాథ్‌ను చార్మినార్ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

మధుసూదన్‌ రెడ్డి వద్ద రూ. 40 లక్షలను తన స్నేహితులకు అ‍ప్పుగా ఇచ్చాడు. ఈ క్రమంలో ఇచ్చిన అప్పును తిరిగి ఇవ్వమన్నందుకు స్నేహితులే చార్మినర్‌ ప్రాంతంలో కిడ్నాప్‌ చేసి.. సంగారెడ్డికి తీసుకెళ్లి దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత వ్యాపారిని పొలంలో పూడ్చిపెట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రధాన నిందితుడిగా భావిస్తున్న జగన్నాథ్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పరారీలో ఉన్న ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

చదవండి: ఏడేళ్ల క్రితం హిజ్రాగా మారిన యువకుడు.. మిత్రులు అన్యాయం చేశారని..

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top