నంబర్‌ ప్లేట్‌ మార్చి.. పోలీసులను ఏమార్చి

 Burglary Took Place At A Temple In Hastinapur - Sakshi

సాక్షి హైదరాబాద్‌:  ‘‘ఇటీవల హస్తినాపురంలోని ఓ ఆలయంలో చోరీ జరిగింది. ఈ కేసులో నిందితులు వాడిన కారు దొంగిలించిందే. సేమ్‌ మోడల్, రంగు ఉన్న కారు నంబర్‌ను ఆన్‌లైన్‌లో వెతికి, నకిలీ హై సెక్యూరిటీ నంబర్‌ ప్లేట్‌ను తయారు చేశారు. ఆపై దీన్ని కొట్టేసిన కారుకు తగిలించి..ఆలయంలో చోరీకి పాల్పడ్డారు. సీసీటీవీలోని ఫుటేజ్‌ ఆధారంగా కారు నంబర్‌ సేకరించిన పోలీసులు.. ఆ అడ్రస్‌కు వెళితే అక్కడున్నది నిందితులు కాకపోవటంతో పోలీసులు ఖంగుతిన్నారు.’’ 
.. ఇలా దొంగలు రూటు మార్చారు. రెక్కీ నిర్వహించి నేరాలకు పాల్పడే నిందితులు ఆప్‌డేట్‌ అయ్యా రు. విచారణలో పోలీసుల దృష్టి మళ్లించేలా కొత్త ప్ర ణాళికలు అమలు చేస్తున్నారు. దొరకొద్దు, దొరికినా ఆలస్యంగా దొరకాలి. ఈ లోపు చోరీ చేసిన సొత్తును తరలించాలి. మొత్తానికి రికవరీ లేకుండా చూసుకుంటామని విచారణలో నిందితులు తెలుపుతుండటంతో పోలీసులు షాక్‌ తింటున్నారు. 

నకిలీ హెచ్‌ఎస్‌ఆర్పీ తయారీ.. 
ఎల్బీనగర్‌ పీఎస్‌ పరిధిలో దేవాలయంలో చోరీకి పాల్పడిన దొంగలు ముందుగా రాజమండ్రిలోలో ఓ  కారును దొంగిలించారు. ఆ తర్వాత సెకండ్‌ హ్యాండ్‌ వాహనాల ఏజెంట్లు, బ్రోకర్ల వాట్సాప్‌ గ్రూప్‌లలో నిందితులు చేరారు. సేమ్‌ కలర్, మోడల్‌ కారు కనిపించగానే.. దాని నంబర్‌తో నకిలీ హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ప్లేట్‌ (హెచ్‌ఎస్‌ఆర్పీ)ని తయారు చేయించి.. దాన్ని దొంగిలించిన కారుకు తగిలించారు. సీసీ కెమెరాల ద్వారా దొంగలు ఉపయోగించిన కారును గుర్తించిన పోలీస్‌లు నంబర్‌ ప్లేట్‌ ఆధారంగా రాజమండ్రికి వెళ్లిపోయారు. తీరా అక్కడికెళ్లాక కారు, దాని యజమాని అక్కడే ఉండటంతో పోలీసులు షాక్‌ తిన్నారు.  

కారు బంపర్‌ ఎలా ఉంది? 
నంబర్‌ ప్లేట్‌ మార్చేసి నిందితులు కన్‌ఫ్యూజ్‌ చేశారని తెలుసుకున్న పోలీస్‌లు.. నంబర్‌ ప్లేట్‌ కాకుండా కారుకు ఇంకా ఏం గుర్తులున్నాయని పరిశీలించారు. బంపర్‌ ఎలా ఉంది? వీల్‌ క్యాప్స్‌ ఎలా ఉన్నాయి? ఫాగ్‌ లైట్లు ఎలా ఉన్నా యి? డెంట్లు ఉన్నాయా? వంటి ఇలా 360 డిగ్రీల కోణంలో కార్‌ను పరిశీలించి.. చోరీ కేసులో నిందితులు వినియో గించింది ఈ కార్‌ కాదని నిర్ధారణకు వచ్చారు. ఆపైన కారు అసలు యజమాని ఫోన్‌ నంబర్‌ను డేటా ఆధారంగా నిందితుడు ఇతగాడు కాదని తెలుసుకున్నారు. ఆపై అసలు నిందితుల కోసం వేట మొదలుపెట్టి.. చివరికి పట్టుకున్నారు. 

పోలీసుల దృష్టి మళ్లించేందుకు.. 
విచారణ సమయంలో పోలీస్‌లను కన్ఫ్యూజ్‌ చేసేందుకు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. చోరీకి వచ్చేటప్పుడు ఎల్బీనగర్‌ పరిసరాల్లోని 20 గల్లీల్లో తిప్పి ఓఆర్‌ఆర్‌ ఎక్కారు. ఆ తర్వాత మళ్లీ గల్లీలు తిరుగుతూ దేవాలయానికి చేరుకొని చోరీకి పాల్పడ్డారు. అనంతరం నేరుగా ఏపీకి వెళ్లకుండా సాగర్‌ హైవేలపై గంటల కొద్ది తిరిగారు. 4–5 గంటల తర్వాత నేరస్తులు విజయవాడ రోడ్‌ మీదుగా పరారయ్యారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top