విషాదం: ఐదు రోజులు గడుస్తున్నా.. | Bodies Of The Deceased Family Members Were Not Found | Sakshi
Sakshi News home page

ఆత్మహత్య ఘటన.. ఇంకా లభించని మృతదేహాలు

Aug 23 2020 2:11 PM | Updated on Aug 23 2020 2:24 PM

Bodies Of The Deceased Family Members Were Not Found - Sakshi

పరిమి నరసయ్య కుటుంబం(ఫైల్‌)

సాక్షి, పశ్చిమగోదావరి: ఈ నెల 18న గోదావరిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడిన కుటుంబ సభ్యుల మృతదేహాలు ఇంకా లభించలేదు. కొవ్వూరు మండలం పశివేదల గ్రామానికి చెందిన ఇంటి యజమాని నరసయ్యకు కరోనా సోకి మృతి చెందడంతో మనస్తాపానికి గురై కుటుంబసభ్యులు ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే.. మృతులు భార్య సునీత, కుతూరు అపర్ణ, కుమారుడు ఫణికుమార్‌లుగా గుర్తించారు. ఐదు రోజులు గడుస్తున్న మృతదేహాలు లభించకపోవడంతో గోదావరి పరివాహక పోలీస్‌స్టేషన్లకు కొవ్వూరు పోలీసులు సమాచారం అందించారు. ('మా నాన్నని విడిచి ఉండలేకపోతున్నాం')

గత మంగళవారం రాత్రి ఇంటి నుంచి ముగ్గురూ కారులో బయలుదేరి రోడ్డు కం రైలు వంతెనపైకి చేరుకుని నదిలోకి దూకినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. నరసయ్య ఇంట్లోని లక్ష్మి అపర్ణ డైరీలో ఓ లేఖ పోలీసులకు లభ్యమైంది. ఆ లేఖలో ‘మా అందరి కోరిక నిహారిక ఓణీల ఫంక్షన్‌ బాగా చేయాలి. దొరబాబు మావయ్య మమ్మల్ని క్షమించు. తాతయ్య.అమ్మమ్మల ఆరోగ్యం జాగ్రత్త. మా నాన్నని విడిచి ఉండలేకపోతున్నాం’’అంటూ లక్ష్మి అపర్ణ రాసినట్టు ఉన్న లేఖ లభ్యమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement