
చత్తీస్‌గఢ్: చత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో నక్సల్స్ ఘాతుకానికి పాల్పడ్డారు. ఛోటేడోంగర్‌లో ఓ బీజేపీ నాయకుడిని నకల్స్ హతమార్చారు. దేవాలయంలో పూజలు చేసేందుకు వెళ్లిన బీజేపీ నాయకుడు కోమల్ మాంఘీని నకల్స్ తీవ్రంగా కొట్టి చంపారు.
సదరు బీజేపీ నేతకు ఆమడై గనుల విషయంలో గతంలోనే నక్సల్స్ హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆయన నక్సల్స్ హెచ్చరికలు పట్టించుకోకపోవటంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ఛోటేడోంగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.