భద్రాద్రి ఆలయం పేరుతో ఫేస్‌బుక్‌ అకౌంట్లు.. అశ్లీల చిత్రాల పోస్టింగ్‌

Bhadradri Kothagudem: Fake FB Pages Indecent Posts On Bhadrachalam - Sakshi

సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: సోషల్‌ మీడియాలో భద్రాద్రి ఆలయం పేరిట ఫేక్‌ అకౌంట్‌లు క్రియేట్‌ చేయడమే కాదు.. అందులో అశ్లీల చిత్రాలు పోస్టు చేస్తున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

భద్రాచలం టెంపుల్ సిటీ, భద్రాద్రి శ్రీ రామ దివ్యక్షేత్రం పేర్లతో ఫేస్ బుక్ అకౌంట్ ఓపెన్ చేశారు ఆగంతకులు. అంతటితో ఆగకుండా ఆ పేజీల్లో అశ్లీల చిత్రాలు అప్ లోడ్ చేస్తూ వస్తున్నారు. ఈ విషయం గమనించిన కొందరు రామభక్తులు.. భద్రాచలం ఏఎస్పీ దృష్టికి విషయం తీసుకువెళ్లారు.
 
ఇదిలా ఉంటే.. భద్రాచలం టెంపుల్ పేరుతో ఎలాంటి సోషల్ మీడియా అకౌంట్లు లేవని ఆలయ అధికారులు స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో పోస్టు చేయబడుతున్న పోస్టులతో ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు. ప్రస్తుతం ఈ వ్యవహారం దర్యాప్తు జరుగుతోంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top