కారాగారానికి కీచక డీఎస్పీ | Karnataka DSP Arrested For Sexually Assaulted Woman, Video Of This Incident Was Recorded | Sakshi
Sakshi News home page

కారాగారానికి కీచక డీఎస్పీ

Jan 5 2025 8:05 AM | Updated on Jan 5 2025 12:22 PM

Karnataka DSP arrested

తుమకూరు: ఫిర్యాదు చేసేందుకు పోలీసు స్టేషన్‌కు వచ్చిన మహిళకు సహాయం చేయాల్సింది పోయి, అసభ్యంగా ప్రవర్తించిన కేసులో మధుగిరి డీఎస్పీ పీ.రామచంద్రప్పకు మధుగిరి తాలూకా ఆస్పత్రిలో పోలీసులు వైద్య పరీక్షలు చేయించారు. శుక్రవారం రాత్రి రామచంద్రప్పను అరెస్టు చేసి శనివారం మధుగిరి జేఎంఎఫ్‌సీ కోర్టు జడ్జి ముందు హాజరు పరిచారు. 

జడ్జి ప్రమీల 14 రోజుల పాటు జుడీషియల్‌ కస్టడీకి ఆదేశించారు. డీఎస్పీ తరఫున సీనియర్‌ న్యాయవాది రఘునాథ్‌రెడ్డి వాదనలు వినిపించగా, బాధితురాలికి వాదనలకు 7 వరకు గడువు ఇచ్చారు. తరువాత నిందితున్ని జిల్లా జైలుకు తరలించారు. 

నిందితుడు రామచంద్రప్ప పోలీసు స్టేషన్‌లోనే రాత్రంతా కూర్చున్నారు. ఓ స్థల వివాదంపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళతో డీఎస్పీ పోలీసు స్టేషన్‌లోనే అసభ్యంగా ప్రవర్తించారు. ఆ వీడియో శుక్రవారం బయటకు రాగా, డీజీపీ ఆయనను సస్పెండ్‌ చేశారు.

పోలీస్‌స్టేషన్‌లో మహిళతో నీచ కృత్యం.. డీఎస్పీ అరెస్ట్‌

  


 

Advertisement
 
Advertisement
Advertisement