వెయిటర్‌ నిర్వాకం.. టిప్పు ఇ‍వ్వలేదని యువకులపై దాడి | Airport Bawarchi Waiter Attacks On Customer In Hyderabad | Sakshi
Sakshi News home page

వెయిటర్‌ నిర్వాకం.. టిప్పు ఇ‍వ్వలేదని యువకులపై దాడి

Dec 15 2021 10:51 AM | Updated on Dec 15 2021 11:02 AM

Airport Bawarchi Waiter Attacks On Customer In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: శంషాబాద్‌లో ఒక వెయిటర్‌ కస్టమర్ల పట్ల అమానుషంగా ప్రవర్తించాడు.  టిప్పు ఇవ్వలేదన్న కోపంతో యువకులపై దాడికి తెగబడ్డాడు. శంషాబాద్‌ పరిధినిలోని ఎయిర్‌పోర్ట్‌ బావర్చీ హోటల్‌లో స్థానికంగా కొంత మంది యువకులు నిన్న(మంగళవారం) రాత్రి బిర్యానీ తినడానికి వచ్చారు. ఆ తర్వాత.. యువకులు బిల్లు చెల్లించి వెళ్లిపోతున్నారు.

ఈ క్రమంలో.. వెయిటర్‌ టిప్పు చెల్లించరా.. అంటూ వాగ్వాదానికి దిగాడు. ఆ తర్వాత హోటల్‌ సిబ్బందితో కలిసి యువకులపై దాడికి తెగబడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు యువకులను సముదాయించి హోటల్‌ నుంచి పంపించి వేశారు. గతంలోను ఇదే హోటల్‌పై  పలు ఆరోపణలు ఉన్నాయి.

ఎయిర్‌పోర్టు బావార్చి సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకొవాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. యువ‌కులు వెయిటర్‌పై స్థానికంగా ఉన్న పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వెయిట‌ర్ పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement