మహిళా టెక్కీ ఆత్మహత్య.. రెండేళ్ల క్రితమే వివాహం.. | 29 Year Old Woman Techie Commits Suicide In Bengaluru | Sakshi
Sakshi News home page

మహిళా టెక్కీ ఆత్మహత్య.. రెండేళ్ల క్రితమే వివాహం..

Dec 11 2021 3:02 PM | Updated on Dec 11 2021 3:32 PM

29 Year Old Woman Techie Commits Suicide In Bengaluru - Sakshi

ప్రతీకాత్మకచిత్రం

సాక్షి, బెంగళూరు: మహిళా టెక్కీ ఆత్మహత్య చేసుకున్న ఘటన అమృతహళ్లి పోలీసుస్టేషన్‌ పరిధిలో జరిగింది. రెండేళ్ల క్రితం వినయ్‌ అనే సివిల్‌ ఇంజనీర్‌తో టెక్కీ సంగీత (29)కు వివాహం జరిగింది. వివాహం అనంతరం వీరు ఇక్కడి వీరణ్ణపాళ్యలో నివాసం ఉంటున్నారు. దంపతుల మధ్య చిన్నపాటి గొడవల కారణంగా గురువారం సాయంత్రం సంగీత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న సంగీత తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని అల్లుడి వేధింపుల వల్లనే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని ఫిర్యాదు చేశారు.  

చదవండి: (నర్సుని బంధించి అత్యాచారం.. అదే రోజు బస్సెక్కించి..)

Advertisement
 
Advertisement
Advertisement