నాలుగేళ్ల బాలుడిపై దారుణం.. | 12 Year Old Boy Molested For 4 Years Reveals Ordeal To Family In Noida | Sakshi
Sakshi News home page

నాలుగేళ్ల బాలుడిపై దారుణం..

Dec 21 2020 1:54 PM | Updated on Dec 21 2020 2:41 PM

12 Year Old Boy Molested For 4 Years Reveals Ordeal To Family In Noida - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

లక్నో: ఉత్తర్ ప్రదేశ్‌లోని గ్రేటర్‌ నొయిడా పరిధిలో పన్నెండేళ్ల బాలుడిపై లైంగిక వేధింపుల ఘటన బయటపడింది. నాలుగేళ్లుగా జరుగుతున్న ఈ అమానుషం బాధిత బాలుని తండ్రి ఫిర్యాదుతో ఆలస్యంగా వెలుగుచూసింది. సెక్టార్‌ బేటా 2 ఎస్‌హెచ్‌ఓ సుజీత్‌ ఉపాధ్యాయ తెలిపిన వివరాల ప్రకారం.. పక్కపక్క ఇళ్లల్లో ఉండే రెండు కుటుంబాలకు చెందిన 12 ఏళ్లు, 16 ఏళ్ల బాలురు ఒకే పాఠశాలలో చదువుతున్నారు. ఒకే బస్‌లో స్కూలు వెళ్లొస్తారు. ఈక్రమంలోనే 12 ఏళ్ల బాలునికి మాయమాటలు చెప్పిన నిందితుడు (16 ఏళ్ల బాలుడు) లైంగిక వేధింపులకు గురిచేశాడు. దీంతో బాధితుడు తీవ్ర మానసిక, శారీరక ఒత్తిడికి గురయ్యాడు. 

ఈక్రమంలోనే చైల్డ్‌ లైఫ్‌ నెంబర్‌ 1098 కి ఫోన్‌ చేసి తన గోడును వెళ్లబోసుకున్నాడు. చైల్డ్‌ లైఫ్‌ ప్రతినిధులు విషయాన్ని అతని కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితునిపై పోక్సో చట్టం, ఐపీసీ 377 సెక్షన్‌ (అసహజ నేరాలు) కింద కేసులు నమోదు చేశామని ఎస్‌హెచ్‌ఓ సుజీత్‌ ఉపాధ్యాయ తెలిపారు. కాగా, 2018లోనే ఓసారి నిందితుని అకృత్యాలు బయటపడినట్టు తెలిసింది. బాధిత బాలుని తల్లిదండ్రులు నిందితుని కుటుంబ సభ్యులను హెచ్చరించడంతో వారు అక్కడ నుంచి ఇళ్లు ఖాళీ చేసి మరోచోటుకు వెళ్లిపోయారు. తాజాగా మరోసారి అలాంటి ఘటనే పునరావృతం కావడంతో పోలీసులను ఆశ్రయించారు.
(చదవండి: దారుణం: చూస్తుండగానే దడేల్‌, దడేల్‌!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement