వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ నేతలు | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ నేతలు

Oct 11 2026 5:18 AM | Updated on Oct 11 2026 5:18 AM

విజయపురం (నగరి): విజయపురం మండలం గంగమాపురం గ్రామానికి చెందిన టీడీపీ మండల స్థాయి నేత చంద్రశేఖర్‌ నాయుడు ఆధ్వర్యంలో సుమారు 50 మంది మాజీ మంత్రి ఆర్కే రోజా సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. ఆమె వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. చంద్రశేఖర్‌ నాయుడుతో పాటు ఆయన అనుచరులు మురుగయ్య, చంగయ్య, రోజా, సభాపతి, లక్ష్మీ, మునెమ్మ, సురేష్‌, గోవిందస్వామి తదితరులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. నాయకులు మాట్లాడుతూ.. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో కులమతాలు, పార్టీలకు అతీతంగా అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందించారని పేర్కొన్నారు. విద్య, వైద్యం, రైతు సంక్షేమం, మహిళా సాధికారత, వృద్ధాప్య పింఛన్ల ద్వారా అనేక కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించారని గుర్తుచేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని విమర్శించారు. నగరి నియోజకవర్గంలో ఆర్కే రోజాను మళ్లీ గెలిపించుకోవడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

ప్రజల మధ్య ఉంటూ పోరాడాలి

మాజీమంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ.. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడం, విద్యార్థులకు మెరుగైన విద్య, రైతులు, మహిళలు, వృద్ధుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వడం లక్ష్యంగా పనిచేశామని తెలిపారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి, పేదల సంక్షేమానికి పెద్దపీట వేయాలని డిమాండ్‌ చేశారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement