చంద్ర నాటకం ! | - | Sakshi
Sakshi News home page

చంద్ర నాటకం !

Oct 10 2026 12:58 AM | Updated on Oct 10 2026 12:58 AM

బీసీలపై చంద్రబాబు కపట ప్రేమ 34 శాతం రిజర్వేషన్‌ అంటూ డ్రామా అధికారం చేపట్టాకు మూడు శాతం కూడా పదవులివ్వని వైనం నామినేటెడ్‌ పదవుల్లోనూ కుట్ర కోర్టులు కొట్టేస్తాయని తెలిసీ బీసీలను వంచించే యత్నం ఇక నమ్మలేమంటున్న బీసీ సంఘాల నేతలు

కాణిపాకం: మాది బీసీల ప్రభుత్వం.. బీసీలే మా పార్టీకి వెన్నుముక అంటూ ఎన్నికల మేనిఫెస్టోలో ఊదరగొట్టిన చంద్రబాబు నేతృత్వంలోని పచ్చ కూటమి ప్రభుత్వం, అధికారంలోకి వచ్చాక వారిని పూర్తిగా పక్కనబెట్టేసింది. ఎన్నికల ముందు హామీల వర్షం కురిపించి ఓట్లు దండుకున్న పచ్చ నేతలు.. తీరా అధికార పీఠమెక్కాక పదవుల పంపిణీకి వచ్చేసరికి మాత్రం బీసీ సామాజిక వర్గాలను తీవ్రంగా విస్మరించారు. ఓట్లేసి గెలిపించినందుకు మాకు దక్కిన బహుమానం ఇదేనా అని జిల్లాలోని బీసీ సంఘాల నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో బీసీలకు పెద్దపీట

గత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా చూడకుండా నిజమైన రాజకీయ భాగస్వాములుగా నిలబెట్టారని బీపీ సంఘాల నేతలు చెబుతున్నారు. నామినేటెడ్‌ పదవులు, కాంట్రాక్టు పనుల్లో చట్టబద్ధంగా 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకే దక్కేలా విప్లవాత్మక చట్టం తెచ్చి అమలు చేశారని గుర్తుచేస్తున్నారు. బీసీలకు ఏకంగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అగ్రపీఠం వేశారని చెబుతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జనాభా ప్రాతిపదికన ఎంపీ, ఎమ్మెల్యే పోటీ స్థానాల్లోనూ, కార్పొరేషన్‌ చైర్మన్‌, జెడ్పీ, ఎమ్మెల్సీ, మేయర్‌, డైరెక్టర్‌ పదవుల్లోనూ బీసీలకే ప్రాధాన్యం ఇచ్చి గౌరవించారని ప్రశంసిస్తున్నారు.

ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్తారు

సుప్రీంకోర్డు బీసీ రిజర్వేషన్‌ పెంపును కొట్టివేస్తుందని చంద్రబాబునాయుడు కు ముందే తెలుసు. గత 30 ఏళ్ల నుంచి బీసీల రిజర్వేషన్‌ పెంచడం..కోర్టు కొట్టివేయడం జరుగుతూనే ఉంది. బీసీల కుల గణన చేపట్టాలి. ఆ తర్వాతే రిజర్వేషన్‌ను అమలు చేయాలి. బీసీలను ఓట్లతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మళ్లీ స్థానిక ఎన్నికల్లో మోసం చేయాలని చూస్తున్నారు. రానున్న ఎన్నికల్లో కచ్చితంగా బీసీలంతా బుద్ధి చెబుతాం.

– గురుమూర్తి, బీసీ నాయకుడు, చిత్తూరు

కూటమి నయవంచన

బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నామంటూ నిబద్ధత లేకుండా కూటమి ప్రభుత్వం జీవో ఇచ్చి బీసీలను మరో సారి నయవంచన చేసింది. తమ పార్టీకి బీసీలు వెన్నెముక అంటూ కల్లబొల్లి మాటలు చెప్పిన చంద్రబాబు వారి రిజర్వేషన్లను చట్టబద్ధత చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌ కల్పించకపోతే రాష్ట్రంలో బీసీలు చూస్తూ ఊరుకోరు. – సోమశేఖర్‌, బీసీ సంక్షేమ

సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు,

ఆలిండియా బహుజన సమాజ్‌ పార్టీ అధ్యక్షుడు

ఇదే పెద్ద డ్రామా

అధికారం కోసం బీసీల జపం చేసే చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మొండి చెయ్యి చూప డం పరిపాటి. ఇన్నేళ్లపాటు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు బీసీ రిజర్వేషన్‌ పై చట్టబద్ధత కోసం ఎందుకు ప్రయత్నించ లేదు. బీసీలను ఓటు బ్యాంకుగా చూసే చంద్రబాబు స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టెక్కేందుకు బీసీ రిజర్వేషన్లు జీవో ద్వారా తెరపైకి తేవడం సిగ్గుచేటు.

– వీ.రమణ,

బీసీ సంఘర్షణ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు

అంతా మాటాల్లోనే..

బీసీలను రాజకీయంగా ఉపయోగించుకుని పదవులు ఇవ్వకుండా మోసం చేసిన చరిత్ర చంద్రబాబుకే దక్కుతుంది. మంత్రి వర్గంలో, ఉన్నత పదువుల్లోనూ బీసీలను సమానంగా గౌరవించరా.. మోసపూరితమైన మాటలతో మభ్యపెట్టాలని చూస్తున్న వారిపై బీసీలు అప్రమతంగా ఉండాలి. రానున్న ఎన్నికల నేపథ్యంలోనే చంద్రబాబు రిజర్వేషన్‌ పెంపును తెరపైకి తీసుకొచ్చారు. ఆ పెంపు డ్రామా అని తేలిపోయింది.

– కుమార్‌, బీసీ నాయకుడు, చిత్తూరు

బీసీలను మోసం చేయడమే

చంద్రబాబు నాయుడు మరోసారి మోసపూరిత తంతుతో బీసీలన మోసం చేయడమే. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబుకు బీసీల పట్ల నిజమైన ప్రేమ ఉంటే నిర్ధిష్టమైన విధానంతో బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత చేయక, మరో మారు వారిని దగా చేయడం దారుణం. 34 శాతం బీసీల రిజర్వేషన్‌ లేకపోతే రాష్ట్రంలో 16 వేలకుపైగా ఎంపీటీసీలు, జెడ్‌పీటీసీల పదవులను బీసీలు కోల్పోయే ప్రమాదం ఉంది. – కల్లూరు నాగరాజగౌడ్‌,

బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికారప్రతినిధి

బీసీలను మభ్యపెట్టేందుకే

బీసీలను మభ్యపెట్టేందుకే చంద్రబాబు ప్రభుత్వం రిజర్వేషన్ల జీవో విడుదల చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన ఈ జీఓ ఏ కోర్టులో నిలబడదు. కూటమి ప్రభుత్వ చర్య బీసీలను మోసం చేయడానికే. తమిళనాడులో శాసన సభ భద్వారా ప్రత్యేక చట్టంచేసి కేంద్రం ద్వారా ఆమోదించడం వల్లనే అక్కడ మొత్తం రిజర్వేషన్లు 69శాతానికి చేరాయి. దీనివల్ల ఏ కోర్టు జోక్యం చేసుకోలేకపోయాయి. చంద్రబాబు ప్రభుత్వం శాసన సభలో తీర్మానం చేసి కేంద్రాని పంపే అవకాశం ఉన్నప్పటికీ ఆ పనిచేయకుండా నామమాత్రపు జీవో ఇచ్చి బీసీలకు అన్యాయం చేసింది.

–కుమారారాజా, మాజీ రాష్ట్ర పాలేకరి కార్పొరేషన్‌ చైర్మన్‌

తెలిసి కూడా డ్రామాలాడుతున్నారు

గతంలో 2014, 2019లో బీసీ రిజర్వేషన్‌ అంశాన్ని కోర్టులో ఈ విషయం తెలిసి కూడా చంద్రబాబు కొత్తగా డ్రామాలాడారు. ఈ డ్రామాలకు న్యాయస్థానం చెక్‌ పెట్టింది. బీసీల అభ్యున్నతికి ఆయన ఏదో కృషి చేసే విధంగా బిల్డప్‌ ఇస్తున్నారు. ఇదంతా ప్రజలకు తెలుసు బీసీ ఓట్ల కోసం ఆడే నాటకాలను ఎవరు సహించారు .తగిన రీతిలో బుద్ధి చెబుతారు.

– శ్రీనివాసులు, జెడ్పీ మాజీ చైర్మన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement