చిత్తూరు కార్పొరేషన్: స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ త్వరలో వెలువడే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు ప్రభుత్వం ప్రతిపాదించిన బీసీ రిజర్వేషన్‌ను కొట్టివేసింది. దీంతో ఎప్పుడైన ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఆదేశాలు వచ్చే అవకాశం ఉంది. దీంతో శుక్రవారం జెడ్పీ కార్యాలయంలో సమావేశ మందిరంలో ఎన్నికల సామగ్రిని సీఈఓ రవికుమార్‌నాయుడు పరిశీలించారు. తెలుపు, గులాబీ రంగు బ్యాలెట్ పేపర్స్, మాన్యూవల్ బుక్స్, ఎన్నికల లా బుక్స్, రిటర్నింగ్ ఆఫీసర్ల బుక్స్, నిబంధనల పుస్తకం, అభ్యర్థుల వివరాలు నమోదు పుస్తకాలు, పోస్టల్ చాలెంజ్ , ఓటర్, అంధ ఓటర్ల కవర్లు ఇలా సామగ్రి వివరాలను తెలుసుకున్నారు.


