సమన్వయంతో నవరాత్రి బ్రహ్మోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

సమన్వయంతో నవరాత్రి బ్రహ్మోత్సవాలు

Oct 10 2026 12:58 AM | Updated on Oct 10 2026 12:58 AM

● సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ ఆదర్శ్‌ రాజేంద్రన్‌

– 8లో

– 8లో

తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించాలని అదనపు ఈవో వెంకయ్యచౌదరి పిలుపునిచ్చారు.

గ్యాస్‌ సరఫరా వేగవంతం చేయాలి

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలోని ఎల్‌పీజీ గ్యాస్‌ వినియోగదారులకు సిలిండర్ల సరఫరా, పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ ఆదర్శ్‌ రాజేంద్రన్‌ గ్యాస్‌ ఏజెన్సీల ప్రతినిధులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని నాగార్జున ఐఏఎస్‌ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో గ్యాస్‌ ఏజెన్సీల ప్రతినిధులు, పౌర సరఫరాల అధికారులతో జేసీ సమీక్ష సమావేశం నిర్వహించారు. జాయింట్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో గ్యాస్‌ సిలిండర్ల లభ్యత, వినియోగదారులకు సకాలంలో పంపిణీ, బుకింగ్‌లకు అనుగుణంగా డెలివరీ చేయాలన్నారు. రాష్ట్ర సగటుతో పోలిస్తే జిల్లా పురోగతి తగ్గడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐవీఆర్‌ఎస్‌ ఫీడ్‌బ్యాక్‌ను పక్కాగా నమోదు చేయాలని స్పష్టం చేశారు. సివిల్‌ సప్‌లైస్‌ అధికారులు స్వయంగా లబ్ధిదారులతో మాట్లాడి, ఫీడ్‌బ్యాక్‌ సేకరించాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా గ్యాస్‌ సిలిండర్ల విక్రయాలు జరిపితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి వెంకటరాయుడు, వివిధ ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement