ఇటీవల నా పొలంలోకి ఒంటరి ఏనుగు వచ్చిందని తెలిసి చుట్టుపక్కల రైతులతో కలిసి అడవిలోకి మళ్లించేందుకు యత్నించాం. ఉన్నట్టుండి ఏనుగు మాపై దాడికి దిగింది. పరుగులు తీస్తుండగా కిందపడి కాలు విరిగింది. దీంతో నడవలేక మంచానికే పరిమితమైయ్యా. అటవీశాఖ అధికారులు అసలు పట్టించుకోలేదు. – దొరై, రైతు, చెత్తపెంట
రాత్రింబవళ్లు చెట్ల పైనే..
అడవికి పక్కన మాది ఏడెకరాల పొలం ఉంది. అందులో వరి, రాగి పంటలను వేశాం.ఫెన్సింగ్ లేకపోవడంతో అడవిలోంచి ఏనుగులు ముందుగా మా పొలంలోకే వస్తుంటాయి. అందుకే ఎత్తయిన చెట్లపై మంచెలు వేసుకున్నాం. రాత్రింబవళ్లు చెట్లపైనే ఉంటూ కాపలా కాస్తున్నాం. ఏనుగులు రాగానే బాణసంచా పేల్చి తరుముతున్నాం. – దేవరాజ్, రైతు, చెత్తపెంట


