పలమనేరు: వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ శుక్రవారం రాత్రి, శనివారం పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్లు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మాజీ మంత్రి రోజా, చిత్తూరు సమన్వయకర్త విజయానందరెడ్డి, ఎమ్మెల్సీ భరత్, పూతలపట్టు, గంగాధరనెల్లూరు సమన్వయకర్తలు డాక్టర్ సునీల్, కృపాలక్ష్మిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అందరి సలహాలు, సహకారంతో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేసేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తానని స్పష్టం చేశారు.
పలమనేరు ఎస్‌పీఎంలో రూ.4.3 కోట్ల కుంభకోణం!
పలమనేరు: పలమనేరు ట్రాన్స్‌కో కార్యాలయ పరిధిలోని ఎస్‌పీఎం (స్పేర్ పార్ట్స్ మేనేజ్‌మెంట్)లో ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతు సెంటర్‌లో గతంలో జరిగిన రూ.4.3 కోట్ల కుంభకోణానికి సంబంధించి విజిలెన్స్ అధికారుల విచారణలో భాగంగా గతంలో ఇక్కడ ఏఈగా పనిచేసిన సూర్యతేజపై స్థానిక పోలీసులకు శనివారం ఫిర్యాదు అందింది. 2024లో ఇక్కడి ట్రాన్స్‌ఫార్మర్ రిపేర్ సెంటర్ ఏఈగా ఉన్న సూర్యతేజ చాలా ట్రాన్స్‌ఫార్మర్లను అక్రమంగా రైతులకు అమ్ముకున్నాడని విజిలెన్స్ విచారణలో వెలుగుచూసింది. సంబంధిత ఏఈ గతంలో గంగవరం ఏఈగా పనిచేస్తూ పలమనేరు ఎస్‌పీఎం వ్యవహారాలను చూస్తూ ఈ అక్రమాలకు పాల్పినట్టు అభియోగం ఉంది. దీనిపై స్థానిక పోలీసులు విచారిస్తున్నారు.


