చిత్తూరు కార్పొరేషన్ : స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలోనే రానున్నట్లు సంకేతాలు ఉన్నాయి. దీంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు భారీగా సాగుతున్నట్లు ప్రచారం చేయాలి. ఇందుకోసం పల్లెపండుగ 3.0తో గ్రామీణాభివృద్ధి పరుగులు తీస్తున్నట్లు పేపర్లు, టీవీల్లో ప్రభుత్వం యాడ్స్ గుప్పిస్తోంది. అయితే పల్లె పండుగ 2.0లో చేపట్టిన పనులకే దిక్కు లేదు. అరకొరగా పూర్తి చేసిన పనులకే బిల్లులు సక్రమంగా విడుదల కాలేదు. దీంతో 3.0 కింద మంజూరైన పనులను చేపట్టేందుకు కాంట్రాక్టర్లు అయిష్టత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
● పాత పనులకే దిక్కులేదు.. మళ్లీ కొత్తవి! ● స్థానిక ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కూటమి కుట్రలు
Oct 11 2026 1:33 AM | Updated on Oct 11 2026 1:33 AM
● పాత పనులకే దిక్కులేదు.. మళ్లీ కొత్తవి! ● స్థానిక ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కూటమి కుట్రలు ● జిల్లాలో పల్లె పండుగ 3.0 కింద 421 అభివృద్ధి పనులకు రూ.46.93 కోట్లు ప్రతిపాదనలు పెట్టారు ప్రతిపాదనలు పెట్టారు. ఇందులో 50 తారురోడ్లు, 338 సిమెంటు, 2 గ్రావెల్ రహదారులను నిర్మించనున్నారు. మొత్తం 110.56 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణానికి రూ. 42.38 కోట్లు కేటాయించారు. ఇందులో 39.71 కి.మీ తారు రోడ్లకు రూ.19.81 కోట్లు, 66.50 కి.మీ, 338 సిమెంటు రోడ్లకు రూ.22.20 కోట్లు, 4.35 కి.మీ, గ్రావెల్ రోడ్లకు రూ.18 లక్షలు మంజూరు చేశారు. వీటిలో చిత్తూరుకు రూ.8 కోట్లు, పూతలపట్టు రూ.9.15 కోట్లు, జీడీనెల్లూరు రూ.8.51 కోట్లు, పలమనేరుకు రూ. 10.42 కోట్లు, నగరి రూ.8 కోట్ల పనులు కేటాయించారు. అలాగే 31 అంగన్‌వాడీ, కమ్యూనిటీ భవనాలు పూర్తి చేసేందుకు రూ.4.14 కోట్లు మంజూరు చేశారు.
● ఈ ఏడాది జనవరిలో పల్లెపండుగ 2.0లో భాగంగా మొత్తం 1,900 పనులకు గాను రూ.213 కోట్లు మంజూరు చేశారు. ఇందులో దాదాపు రూ.100 కోట్ల పనులు మాత్రమే పూర్తయ్యాయి. అందులో రూ.31 కోట్లు పనులకే బిల్లులు చెల్లించారు. మిగిలిన రూ.69 కోట్లు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.
Advertisement


