పరిష్కారం కాని అనేక సమస్యలు
సక్రమంగా అమలు కాని పథకాలు
8న కలెక్టరేట్ వద్ద ధర్నాకు సన్నాహాలు
●
రెక్కాడితేగానీ డొక్కాడని భవన నిర్మాణ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం పిడికిలి బిగిస్తున్నారు. డిమాండ్ల సాధన కోసం ఈనెల 8న కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగనున్నారు. ఎన్నికల సమయంలో గుప్పించిన హామీలను అమలు చేయాలని స్పష్టం చేస్తున్నారు. భరోసా కల్పించకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.
చిత్తూరు కార్పొరేషన్ : జిల్లాలో భవన నిర్మాణ కార్మికులు 52 రకాల విభాగాల నుంచి దాదాపు 2.40 లక్షల మంది వరకు ఉన్నట్లు అంచనా. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో టీడీపీ నేతలు భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చిన హామీలు నీటిమూటలయ్యాయి. సుమారు రెండున్నరేళ్ల చంద్రబాబు పాలనలో ఆ హామీలు అమలు చేయకుండానే నెట్టుకొచ్చారు. దీనిపై అనేక సార్లు జిల్లాలో భవన నిర్మాణ కార్మికులు వివిధ రూపాల్లో ఆందోళనలు చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరించాల్సిన నినదించారు. బిల్డింగ్ వెల్ఫేర్ బోర్డు ద్వారా కార్మికులకు అందించే సాయం మొత్తాలను 2016లో నిర్ణయించగా, పదేళ్ల తర్వాత సైతం అవే కొనసాగిస్తోంది. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ప్రమాద బీమాగా రూ.10 లక్షలు, సహజ మరణానికి రూ.2 లక్షలు, వివాహ సాయంగా రూ.50 వేలు ఇస్తున్నారు. ఏపీలో ప్రమాద బీమా, శాశ్వత అంగ వైకల్యానికి సాయం సక్రమంగా ఇవ్వడం లేదు.
సమస్యలు పట్టని ప్రభుత్వం
ఎన్నికల హామీలో పేర్కొన్న బిల్డింగ్ వేల్ఫ్‌ర్ బోర్డు పునరుద్ధరణ హామీని కార్మికుల పోరాటాలతో రెండేళ్ల తర్వాత కాని అమలు చేయలేదు. వెల్ఫేర్ బోర్డులో 9 రకాల సంక్షేమ పథకాలు ఉన్నప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం కేవలం, ప్రసూతి, వివాహ సాయం, సహజ మరణం పొందినప్పుడు ఇచ్చే సాయం మాత్రమే అమలు చేస్తోంది. కార్మికుని కుటుంబంలో వివాహానికి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.40 వేల ఆర్థిక సాయం అందించేది. చంద్రబాబు సర్కారు ఆ మొత్తం ఇస్తున్నట్లు ప్రకటించినప్పటికీ రూ.20వేలు మాత్రమే ఇస్తున్నారని కార్మి క సంఘ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రధాన డిమాండ్లు ఇవీ..
ఆందోళన దిశగా భవన నిర్మాణ కార్మికులు
డిమాండ్లు తీర్చాల్సిందే..
భవన నిర్మాణ కార్మికులకు ఎన్నికల సమయంలో చంద్రబాబ ఇష్టారాజ్యంగా హామీల ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ప్రమాద సమయంలో, మరణించినప్పుడు, వివాహ సమయంలో, పిల్లల చదువులకు ఎటువంటి సాయం ఇవ్వడం లేదు. భవన నిర్మాణ కార్మికుల డిమాండ్లను తీర్చాల్సిందే.
– గంగరాజు, సీఐటీయూ జిల్లా గౌరవ అధ్యక్షుడు


