వైద్య సిబ్బంది పోరుబాట | - | Sakshi
Sakshi News home page

వైద్య సిబ్బంది పోరుబాట

Oct 6 2026 1:42 AM | Updated on Oct 6 2026 1:42 AM

● జిల్లావ్యాప్తంగా కాంట్రాక్ట్‌ ఉద్యోగుల నల్ల బ్యాడ్జీలతో నిరసనలు ● నేటి నుంచి విధుల బహిష్కరణ ● కాంట్రాక్ట్‌ సిబ్బందిని రెగ్యులరైజ్‌ చేయాలని డిమాండ్‌ ● ఏళ్ల తరబడి సేవలందిస్తున్న అర్హులైన కాంట్రాక్ట్‌ సిబ్బంది అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని వెంటనే ఉద్యోగాలను రెగ్యులరైజ్‌ చేయాలి. మూల వేతనం, కరువు భత్యం, ఇంటి అద్దె భత్యం కలిపి గ్రాస్‌ జీతాన్ని పునరుద్ధరించి అమలు చేయాలి. ● 2018 నుంచి అమల్లోకొచ్చిన వేతన తగ్గింపు నిర్ణయాన్ని సమీక్షించి, పాత పద్ధతిలో చెల్లించాలి. ● ఖాళీల భర్తీకి రెగ్యులర్‌ నియామక నోటిఫికేషన్లు ఇచ్చే ముందు ప్రస్తుతం పనిచేస్తున్న అర్హులైన కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు ప్రాధాన్యత ఇవ్వాలి. ● పెండింగ్‌ డిమాండ్లపై తమ ప్రతినిధులతో వెంటనే ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేయాలని, డిమాండ్లపై తీసుకున్న చర్యలకు సంబంధించి ఒక నిర్దిష్ట కాలపరిమితితో కూడిన ఆక్షన్‌ టేకెన్‌ రిపోర్ట్‌ సమర్పించేలా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేయాలి.

ఏళ్ల తరబడి వైద్య, ఆరోగ్య శాఖలో సేవలందిస్తున్న కాంట్రాక్ట్‌ సిబ్బంది తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పోరుబాట పట్టారు. ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ – హెల్త్‌ కాంట్రాక్ట్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ పిలుపు మేరకు సోమవారం నుంచి జిల్లా వ్యాప్తంగా నిరసనకు దిగారు.

కాణిపాకం: అధికారులకు సమ్మె నోటీసు అందజేశారు. ఏళ్ల తరబడి ప్రభుత్వం చుట్టూ, అధికారుల చుట్టూ తిరిగినా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో వేరే దారి లేక వైద్య, ఆరోగ్య శాఖలో సేవలందిస్తున్న కాంట్రాక్ట్‌ సిబ్బంది నిరసనల్లోకి దిగుతున్నట్లు ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు. సోమవారం నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. మంగళవారం నుంచి విధులు బహిష్కరించనున్నారు. జిల్లాలో ఒక జిల్లా ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి, 4 ఏరియా ఆస్పత్రులు, 8 కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు 50 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. వీటి పరిధిలో కాంట్రాక్ట్‌ పద్ధతిలో 283 మంది స్టాఫ్‌ నర్సులు, ఫార్మాసిస్ట్‌లు 82 మంది, ల్యాబ్‌ టెక్నీషియన్లు 68 మంది పనిచేస్తున్నారు. వీరంతా పెద్ద ఎత్తున నిరసనలో పాల్గొంటున్నారు. జిల్లాలోనే వందలాది మంది స్టాఫ్‌ నర్సులు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఫార్మసీ అధికారులు, పారామెడికల్‌ సిబ్బంది రాత్రింబవళ్లు ప్రజారోగ్యానికి సేవలందిస్తున్నారు. ప్రభుత్వం సరిపడా రెగ్యులర్‌ నియామకాలు జరపకపోవడంతో, తగినంత విద్యార్హతలు, అనుభవం ఉన్న సిబ్బంది సుదీర్ఘకాలంగా కాంట్రాక్ట్‌ ఉద్యోగులుగానే ఉండిపోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా లాంటి క్లిష్ట సమయాల్లోనూ ప్రాణాలకు తెగించి సేవలు అందించిన తమను క్రమబద్ధీకరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన

జిల్లా వ్యాప్తంగా అధికారులకు నోటీసులు ఇచ్చారు.తమ న్యాయమైన సమస్యలపై ఇప్పటికే సంబంధిత హెచ్‌ఓడీలు, ఉన్నతాధికారులకు అనేకమార్లు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని జేఏసీ నాయకులు గుర్తుచేశారు. సోమవారం నుంచి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతున్నారు. ప్రభుత్వం కళ్లు తెరవాలని, తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. మంగళవారం నుంచి విధులు బహిష్కరించిన నిరసనలో పాల్గొంటామని జేఏసీ జిల్లా ప్రతినిధులు స్పష్టం చేశారు. దీంతో ప్రభుత్వం వారి స్థానంలో విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లో పనిచేసే సిబ్బందిని సర్దుబాటు చేయాలని చూస్తోంది. అయితే వారిని ఆస్పత్రులకు సర్దుబాటు చేస్తే ఇప్పుడు అరకొరగా నడుస్తున్న ఆ పల్లె వైద్యం పూర్తిగా నిర్వీర్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ప్రధాన డిమాండ్లు ఇవే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement