– 8లో
ఐకేపీ అధికారులు రూ.120 కి విక్రయిస్తున్న చీపుర్లు చీపురు కట్టలను డ్వాక్రా సభ్యులకు నిరాకరిస్తున్నారు.
సేవచేసే మమ్మల్ని తప్పించి..
డప్పుకొట్టే వారిని తీసుకుంటున్నారు
ప్రజల ఇంటి వద్దకు వెళ్లి ప్రభుత్వ సేవలను అందించిన మమ్మల్ని వదలి ఆనాడు అవమానించినవారే.. ఇప్పుడు సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్సర్లకు ప్రజాధనంతో ప్రచార బాధ్యతలు అప్పగించడం ఎంతవరకు సమంజసం? ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఇన్‌ప్లూయెన్సర్ల అవసరం ఎందుకు వచ్చింది?వారికి చెల్లించే పారితోషకం, ఎంపిక విధానం, నిధుల వినియోగంపై ప్రభుత్వం పూర్తి వివరాలను ప్రజల ముందుంచాలి. సేవ చేసిన మమ్మల్ని పక్కనపెట్టి.. డప్పుకొట్టే వారిని ప్రజల సొమ్ముతో తీసుకోవడం ఏమిటో ప్రభుత్వం సమాధానం చెప్పాలి.
– మోహన్, మాజీ వలంటీర్, కార్వేటినగరం
మమ్మల్ని మోసం చేయడం తగదు
ఎన్నికల సమయంలో తాను అధికారంలోకి వస్తే వలంటీర్లకు నెలకు రూ.10 వేల వేతనం ఇస్తానని నమ్మబలికిన చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చాక మమ్మల్ని మోసం చేశారు. ఇప్పుడేమో ఆయన గొప్పలు చెప్పుకోవడానికి సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్సర్లను పెట్టుకొని ప్రభుత్వ సొమ్మును అప్పనంగా దోచిపెట్టేందుకు యత్నిస్తున్నారు. మా కడుపులు కొట్టి చంద్రబాబు బాగుపడేది లేదు. నమ్మించి మోసం చేసిన ఆయనకు రాబోయే ఎన్నికల్లో గుణపాఠం తప్పదు.
– చలపతి, మాజీ వలంటీర్, పాదిరికుప్పం


