తొలగించిన 13 కోట్ల ఓట్లలో బడుగు బలహీన వర్గాలవే అధికం
జగనన్నను విమర్శించే స్థాయి శివరాజ్ సింగ్ ది కాదు
రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి
నారాయణస్వామి
గంగాధరనెల్లూరు: ఓట్ల తొలగింపు అంటే రాజ్యాంగంపై దాడితో సమానమని రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి వ్యాఖ్యానించారు. గంగాధర నెల్లూరు మండలంలోని మహదేవ మంగళంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ భారత చీఫ్ ఎన్నికల కమిషనర్ ప్రస్తుతం ప్రత్యేక విధివిధానాలతో అస్తవ్యస్తం చేస్తున్నారని విమర్శించారు. దేశంలో దాదాపు 13 కోట్ల ఓట్ల తొలగించారని మండిపడ్డారు. ఓటు కోల్పోయిన వారిలో అధికులు బడుగు బలహీన వర్గాలకే చెందిన వారే ఉన్నారన్నారు. ఒకప్పటి ఎన్నికల కమిషనర్ శేషన్ దేశ చరిత్రలో అత్యున్నతంగా ఎన్నికల విధివిధానాలను అవలంభించారని కొనియాడారు. ప్రస్తుత జ్ఞానేష్ కుమార్ అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని మండిపడ్డారు.
శివరాజ్ సింగ్ ది జగనన్నను
విమర్శించే స్థాయి కాదు
రాష్ట్ర చరిత్రలోనే కాదు.. భారత దేశ చరిత్రలోనే పేద ప్రజలను అభివృద్ధికి ప్రత్యేక సంక్షేమ పథకాలు రూపొందించిన గొప్ప వ్యక్తి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అని నారాయణస్వామి తెలిపారు. చంద్రబాబు మెప్పుకోసం శివరాజ్ సింగ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం మంచి పద్ధతి కాద న్నారు. శివరాజ్ సింగ్ వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాన్నా రు. జగనన్నను విమర్శించే స్థా యి శివరాజ్ సింగ్‌కు లేదన్నారు.
స్థానిక ఎన్నికల్లో
అధికార పార్టీ కుట్రలను తిప్పికొడదాం
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రస్తుత కూటమి ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ నేతలపై అనేక కేసులు పెట్టే అవకాశం ఉందని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని బెదిరింపులకు గురిచేస్తారని, నాయకులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. అంతా కలిసికట్టుగా విజయం సాధించాలని కోరారు. పేదల పక్షాన పోరాడేందుకు వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
చీఫ్ ఎన్నికల కమిషనర్ నిర్ణయాలు రాజ్యాంగ విరుద్ధం


